calender_icon.png 25 November, 2025 | 12:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసిన జీడీ సారయ్యపై చర్యలు తీసుకోవాలి

25-11-2025 12:28:47 AM

గజ్వేల్ పోలీస్ స్టేషన్లో బ్రాహ్మణ సంఘం వినతి

గజ్వేల్, సోమవారం24: జీడి సారయ్య తన గానంలో బ్రాహ్మణులను కించపరిచే పదాలను ఉపయోగించడం తీవ్ర ఆగ్రహానికి దారితీసిందని, సమాజంలో శాంతిని భంగపరచే విధంగా, కులాలను రెచ్చగొట్టే నాస్తికవాద ధోరణులతో వ్యవహరిస్తున్నాడని బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నేతలు తప్పుబట్టారు. ఈ మేరకు జీడి సారయ్య పై చర్యలు తీసుకోవాలని గజ్వేల్ పోలీస్ స్టేషన్లో బ్రాహ్మణ సంఘం సిఐ రవికుమార్రవికుమార్ కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘం డివిజన్ అధ్యక్షులు దేశపతి శంకర శర్మ మాట్లాడుతూ సనాతన ధర్మంపై దాడి చేయడాన్ని బ్రాహ్మణులపై దాడి చేయడం భావిస్తున్నామని, వెంటనే జీడి సారయ్యను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని గజ్వెల్ డివిజన్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య డిమాండ్ చేసింది. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రేబల్లి రవీందర్ రావు, కోశాధికారి విఠాల కృష్ణమూర్తి, న్యాయ సలహాదారులు అష్టకాల కిరాణసాగర్ రావు (G.P), వి.వి. రమణతో పాటు సభ్యులు మధురావు, మోహనరావు, మోహనశర్మ తదితరులు పాల్గొన్నారు.