25-11-2025 12:25:49 AM
నారాయణపేట, నవంబర్ 24 (విజయక్రాంతి) : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులకు తగిన ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లోని ప్రజావాణి హాల్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ అర్జీలను అందజేశారు.
వారి సమస్యలను విని అర్జీలను స్వీకరించిన అదనపు కలెక్టర్ ప్రజలు ఇచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. సోమవారం నాటి ప్రజావాణి కార్యక్రమానికి 20 ఫిర్యాదులు అందాయి. కలెక్టరేట్ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.