25-11-2025 12:27:11 AM
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల, నవంబర్ 24: అభివృద్ధి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఎంపీడీవో ఆఫీస్ లో చీరలను ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జడ్చర్ల రూరల్ మండలానికి సంబంధించి 36 గ్రామ సంఘాలు, 9994 మహిళలు ఉన్నారని పేర్కొన్నారు.
అనంతరం మహిళలకు యూనిఫామ్ చీరలు పంపిణీ, లబ్ధిదారులకు 112 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులన జడ్చర్ల మండలంలోని మహిళా సమైక్య కార్యాలయంలో ఎమ్మెల్యే అందించారు. ఆడపిల్లల వివాహానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకాల ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.