25-11-2025 12:27:33 AM
సిద్దిపేట నవంబర్ 24 (విజయక్రాంతి): గ్రామ పాలన అసోసియేషన్ రాష్ట్ర సంయు క్త కార్యదర్శిగా మద్దెల కమలాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన గ్రామ పాలన ఉద్యోగుల అసోసియేషన్ ఎన్నికలలో సిద్దిపేట జిల్లాకు చెందిన మద్దెల కమలాకర్ సంయుక్త కార్యదర్శిగా ఎన్నుకోవడం పట్ల జిల్లా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రా ష్ట్రస్థాయి బాధ్యతలు అప్పగించిన ఉద్యోగులకు సేవలందిస్తానని తెలిపారు. తన నియా మకానికి సహకరించిన జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, అసోసియేషన్ సభ్యులకు, ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు.