calender_icon.png 17 August, 2025 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాక్ వరదల్లో 321కి చేరిన మృతులు

17-08-2025 12:07:30 AM

- రోజురోజుకూ పెరుగుతున్న మృతుల సంఖ్య

- కొనసాగుతున్న సహాయక చర్యలు

ఇస్లామాబాద్, ఆగస్టు 16: పాకిస్థాన్‌లో గడిచిన 48 గంటల్లో కురిసిన భారీ వర్షాలకు మృతి చెందిన వారి సంఖ్య శనివా రానికి 321కి చేరుకుంది. ఖైబర్ పంఖ్తుఖ్వా ప్రావిన్స్‌లోనే రికార్డు స్థాయిలో 307 మంది మరణించినట్టు నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆఫ్ పాకిస్థాన్ అధికారులు తెలిపారు.

9 మంది పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని గిల్గిత్ బల్టిస్తాన్ రీజియన్‌లో మరణించినట్టు పేర్కొన్నారు. భారీ వర్షాలకు సంభవించిన ఆకస్మిక వరదల వల్లే అత్యధిక మంది మృతి చెందినట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అవసరం అగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూ చించారు. రాబోయే కొద్ది గంటల్లో వాయు వ్య పాకిస్థాన్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.