17-08-2025 12:12:15 AM
-ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కేంద్రం ఎన్నికల సంఘం!
-ఈసీని కుదిపేస్తున్న బీహార్ ఓటర్ల జాబితా సవరణ
-రాజ్యాంగబద్ధ సంస్థపై ఓట్ల చోరీ సహా ఇతర ఆరోపణలు
-అధికార పార్టీలకు కొమ్ముకాస్తుందంటూ ప్రతిపక్షాల మండిపాటు
న్యూఢిల్లీ, ఆగస్టు 16: ప్రస్తుతం బీహార్ ఓటర్ల జాబితా సవరణ రగడ దేశాన్ని కుదిపేస్తోంది. ఈ ఏడాది చివర్లో బీహార్‌లో జరగ నున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఏడా ది జూన్ 24న స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ఆధారంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ప్రారంభించింది.
దాదాపు రెండు నెలల పాటు సమగ్ర సవరణ జరిపి ఎస్‌ఐఆర్ రూపొందించిన నివేదికను ఆగస్టు 1న కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిం ది. బీహార్‌లో మొత్తం 7.24 కోట్ల మంది ఓటర్లు తమ ఎన్యుమరేషన్ వివరాలను ప్రకటించారని.. మిగతా 65.6 లక్షల ఓటర్లలో 22 లక్షల మంది చనిపోయారని, మరో 36 లక్షల మంది వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారని, 7 లక్షల ఓటర్లు రెండు ప్రాంతాల్లో ఓ ట్లు కలిగి ఉన్నారని, ఇంకొంత మంది తన వివరాలు ఇచ్చేందుకు సముఖత చూపలేదని స్పష్టం చేసింది.
అయితే 2024లో జరి గిన పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 7.90 కోట్ల మంది ఓటేశారు. కేవలం ఏడాది వ్యవధిలోనే దాదాపు 65 లక్షల ఓట్లు గల్లంత వ్వడం చర్చకు దారి తీసింది. ఇదే విషయమై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ సీని ప్రశ్నించింది. బీహార్‌లో 65 లక్షల ఓటర్ల వివరాలు ఏమయ్యాయో చెప్పాలని పేర్కొం ది. ఆగస్టు 22 నాటికి సమ్మతి నివేదికను సమర్పించాలని సూచించింది. డిస్‌ప్లే బో ర్డులు, వెబ్‌సైట్‌లో పేర్లను ప్రదర్శించడం వల్ల అనుకోకుండా జరిగిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుందని.. ఈ విష యంలో సదరు ఓటర్ల కోసం పబ్లిక్ నోటీసు జారీ చేసే విషయాన్ని పరిశీలించాలని ఈ సీకి సూచించింది. బీహార్‌లో 65 లక్షల ఓట్లు ఏమయ్యాయనే పూర్తి వివరాలను డిస్‌ప్లే బోర్డులు, వెబ్‌సైట్‌లో ఉంచాలని ప్రతిపక్ష ఇండియా కూటమి డిమాండ్ చేసింది.
బీజేపీతో ఈసీ కుమ్మక్కు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమయం చిక్కినప్పుడల్లా ఎన్నికల సం ఘంపై తన అస్త్రాలను ఎక్కుపెడుతూనే వస్తున్నారు. అధికార బీజేపీతో ఈసీ కుమ్మక్కైం దంటూ ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఓట్ల చోరీతోనే చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని వాపోయారు. బీజేపీకి ఈసీ తొత్తుగా మారిందనేందుకు తన వద్ద ఆటమ్ బాంబు లాంటి వార్త ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిలో భాగంగా గత గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ ఇందిరా భవన్ ప్రధాన కార్యాలయంలో ప్రజంటేషన్ రూపంలో ఈసీ చేస్తున్న ఓట్ల చౌర్యాన్ని ఆధారాలతో సహా బయటపెట్టారు.
కర్ణాటకలోని ఒక్క మహదేవపుర అసెంబ్లీ సెగ్మెం ట్‌లో లక్షకు పైగా ఓట్లు చోరీకి గురయ్యాయని.. ఇవి ఐదు రకాలుగా జరిగాయని వివ రించారు. నకిలీ ఓట్లు, చెల్లని చిరునామాలు, బల్క్ ఓటర్లు, చెల్లని ఫొటోలు ఉన్న ఓటర్లు, ఫారం దుర్వినియోగం వివరాలను వెల్లడించారు. అంతేకాదు ఒకే రూంలో 80 మంది ఓటర్లు ఎలా నివసిస్తున్నారు.. వారందరూ ఓట్లు ఎలా వేశారో చెప్పాలని ఈసీని ప్రశ్నించారు. ఈసీ అండతో కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీగా ఓట్లు చోరీకి పాల్పడి అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. బీహార్‌లో ఎస్‌ఐఆర్ పేరుతో 65 లక్షల మంది ఓట్లను ఈసీ గాయబ్ చేసిందని ఆరోపించారు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నేడు బీహార్‌లో ‘ఓటు అధికార యాత్ర’ చేపట్టను న్నారు. మరోవైపు ఓట్ల చోరీపై ప్రతిపక్షాల ఆరోపణలు తిప్పికొట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆదివారం కీలక ప్రెస్‌మీట్ పెట్టనుంది.
పని రాక్షసుడిగా ముద్ర..
పనిరాక్షసుడిగా పేరొందిన శేషన్.. తన పనిని పూర్తి చేయటానికి, పనిని అర్థం చేసుకోవటానికి ఏమాత్రం మొహమాటపడే వారు కాదు. చెన్ను ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేసినప్పుడు.. సమస్యలను అర్థం చేసుకోవటానికి తానే డ్రైవర్‌గా మారి ప్యాసింజర్ బస్సులు నడిపారు. ఐఏఎస్‌గా రాజకీయ పరిమితులను ఎదుర్కొన్న శేషన్.. రాజ్యాంగబద్ధమైన సీఈసీగా బాధ్యత చేపట్టగానే విశ్వరూపం ప్రదర్శించటం ఆరం భించారు. సీఈసీగా శేషన్ రాజ్యాంగమిచ్చిన అధికారాలను ఉపయోగించి ఎన్నికల నిర్వహణలో ఉన్న 150 లోపాలను గుర్తించి కత్తెర వేశారు. అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.
సంస్కరణల ప్రభావం..
శేషన్ తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా 1999 సార్వత్రిక ఎన్నికల్లో తప్పుడు లెక్కలు చూపించిన కారణంగా దాదాపు 1500 మంది అభ్యర్థులపై మూడేళ్లపాటు వేటు పడింది. మంత్రులను తొలగించాలం టూ ఏకంగా అప్పటి ప్రధాని పీవీ నరసింహారావుకు డిస్మిస్ సిఫార్సు చేసిన ఉద్దండుడు శేషన్. పీవీ హయాంలో ఆయన మంత్రివర్గ సభ్యులు సీతారాం కేసరి, కల్పనాథ్ రాయ్ లు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ.. వారిని కేబినెట్ నుంచి తొలగించాలని శేషన్ ప్రధానికి సిఫార్సు చేశారు. దీనిపై దుమారం రేగింది. శేషన్ తన పరిధులు దాటి ప్రవర్తిస్తున్నారంటూ.. ఆయన్ను పార్లమెంటులో అభి శంసించాలనే డిమాండ్ తలెత్తింది.
ఇదంతా కాని పని అని తెలిసిన పీవీ చాకచక్యంగా మరో ఇద్దరు (ఎం.ఎస్.గిల్, జీవీజీ కృష్ణమూర్తి) ఎన్నికల కమిషనర్లను నియమించి శేషన్‌కు ముకుతాడు వేసే ప్రయత్నం చేశా రు. ఆ ఇద్దరు కమిషనర్లను శేషన్ గాడిదలుగా అభివర్ణించడం గమనార్హం. ఆ తర్వాత వారిద్దరిని కార్యాలయంలోకి రాకుండా అడ్డుకున్నారు. వీరి నియామకాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. కానీ ఎన్నికల కమి షన్ బహుళ సభ్య సంస్థగా ఉండాలన్న రాజ్యాంగ నిబంధనలను ఎత్తి చూపుతూ సుప్రీంకోర్టు శేషన్ పిటిషన్‌ను కొట్టేసింది.
ఎన్నికల సంస్కరణలకుగాను రామన్ మెగసెసె అవార్డు అందుకున్న శేషన్.. సీఈసీగా పదవీ విరమణ చేశాక రాజకీయ ప్రవేశం చేశారు. 1997లో రాష్ర్టపతి ఎన్నికల్లో కె.ఆర్.నారాయణన్‌పై పోటీ చేసి ఓడిపోయారు. 1999లో గాంధీనగర్ లోక్‌సభ స్థానంలో అప్పటి బీజేపీ నేత ఎల్‌కే అడ్వాణీపై పోటీచేసి పరాజయం పాలయ్యారు. శేషన్ 2019 నవంబరు 10న చెన్నులో కన్నుమూశారు.
టీఎన్ శేషన్ తీసుకొచ్చిన సంస్కరణలు
-ఎన్నికల నిబంధనావళి కచ్చితంగా అమలు.
-ఓటర్ ఐడీ కార్డుల జారీ
-గోడలపై రాతలు బంద్
-అభ్యర్థుల ఖర్చుకు పరిమితులు విధించటం
-మతపరమైన స్థలాల్లో ఎన్నికల ప్రచారంపై నిషేధం
-ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాల నుంచి పరిశీలకులను నియమించటం
-ప్రచారానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడటంపై నిషేధం
-అనుమతి లేకుండా మైకుల వాడకంపై నిషేధం
-సంస్థాగత ఎన్నికలు జరపని పార్టీల గుర్తింపు రద్దు చేస్తానని హెచ్చరిక
నేటి నుంచి ‘ఓట్ అధికార్ యాత్ర’
-బీహార్‌లో రాహుల్ గాంధీ భారీ పాదయాత్ర
-ససారంలో ప్రారంభం
-16 రోజులు, 23 జిల్లాల్లో యాత్ర
-సెప్టెంబర్ 1న పరిసమాప్తం
పాట్నా, ఆగస్టు 16: బీహార్ ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ద్వారా ఓట్లను దొంగిలించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం నుంచి ‘ఓట్ అధికార్ యాత్ర’ చేపట్టనున్నారు. 16 రోజుల పాటు జరగనున్న ఈ యాత్ర బీహార్‌లోని 23 జిల్లాల్లో ఉండనుంది. వన్ పర్సన్ ఓట్ అనే నినాదంతో ఈ యాత్ర కొనసాగనుంది. ‘మేం ఓటర్ హక్కుల యాత్రను ప్రజల్లోకి తీసుకువస్తున్నాం. ఇది ఓటును కాపాడుకునే పోరాటం.
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు బీహార్‌లో మాతో కలిసి రండి’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అంతకుముందు యాత్రకు సంబంధించిన పాటను ఆయన సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. యాత్రకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. బీహార్‌లోని పార్టీలు ఈ యాత్రను ఓటు బందీగా వర్ణించాయి. ఈ యాత్రతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడనుందని ఆరోపించాయి. ఈ యాత్ర ససారంలో ప్రారంభం కానుంది.
నేడు మీడియా ముందుకు ఈసీ
- ఓట్ల చోరీ ఆరోపణలతో హోరెత్తిస్తున్న కాంగ్రెస్
- బీహార్‌లో ఓటర్ల ముసాయిదా జాబితాపై పెద్ద ఎత్తున విమర్శలు
- వాటన్నింటికీ సమాధానం ఇచ్చే యోచనలో పోల్ బాడీ
న్యూఢిల్లీ, ఆగస్టు 16: గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘం (ఈసీ)పై ఓట్ల చోరీ ఆరోపణలు చేస్తోంది. అంతే కాకుండా బీహార్‌లో నిర్వహించిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సుప్రీం కోర్టు కూడా తొలగించిన ఓటర్ల జాబితాను ప్రదర్శించాలని ఈసీని ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈసీ ఆదివారం దేశరాజధాని న్యూఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కోసం తప్పా ఈసీ మరే వి షయాలపై ఇంతవరకూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయలేదు. కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ తరచూ ఆ రోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై సమాధానం ఇచ్చేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది.