calender_icon.png 17 August, 2025 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్రైపాక్షిక చర్చలే తరువాయి..

17-08-2025 12:15:23 AM

-రష్యా కాల్పుల విరమణ కోసం అలస్కా వేదికగా ట్రంప్ సమావేశం 

-దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘమైన చర్చలు 

-మాస్కోలో తదుపరి భేటీ ఉంటుందని ప్రకటించిన పుతిన్

-అలస్కా సమావేశానికి 10/10 రేటింగ్ ఇచ్చిన ట్రంప్

-రేపు వైట్ హౌజ్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ

-చర్చలను స్వాగతించిన భారత్

అలస్కా, ఆగస్టు 16: రష్యా మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య అలస్కా వేదికగా దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఎటువంటి ఒప్పం దం కుదరలేదు. అలస్కా యాంకొరేజ్‌లోని జాయింట్ బేస్ ఎల్మెండార్ఫ్ రిచర్డ్‌సన్ సైనిక స్థావరంలో ఈ ఇద్దరు నేతల భేటీ జరిగింది. పుతిన్ కంటే ముందుగానే అలస్కాకు వెళ్లిన ట్రంప్ అనంతరం పుతిన్ అక్కడకు రాగానే  ఆత్మీయ స్వాగతం పలికారు.

రెడ్ కార్పెట్‌తో సాదరంగా ఆహ్వానించారు. కరచాలనం తర్వాత ఇద్దరు నేతలు ముందుకు నడుచుకుంటూ వెళ్తుండగా.. ట్రంప్ అమెరికా సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శించారు. అక్క డే ఉన్న పోడియం వద్దకు ఇరువురు నేతలు వెళ్లే సమయంలో వారిపై నుంచి బీ బాం బర్లు, యుద్ధ విమానాలు ప్రయాణించాయి. అనంతరం ఇద్దరు నేతలు కలిసి ట్రంప్ కారు బీస్ట్‌లో ప్రయాణించారు.  ప్రయాణసమయంలో ఈ నేతలిద్దరూ ఒకే సీట్లో పక్కప క్కనే కూర్చొని పయనించారు.

సమావేశంలో  ఏ ఒప్పందం కుదరలేదు. సోమ వారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ట్రంప్ తో వాషింగ్టన్‌లో భేటీ అవనున్నారు. అల స్కా భేటీకి ట్రంప్ 10/10 రేటింగ్ ఇచ్చారు. ఇక భారత్‌పై ట్రంప్ సుంకాలను తగ్గిస్తారని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అం దుకు సంబంధించి ట్రంప్ ఎటువంటి ప్రకటన చేయకపోయినా పుతిన్‌తో చర్చలు ఫల ప్రదంగా ముగిశాయని ట్రంప్ పేర్కొనడం తో అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

తదుపరి భేటీ మాస్కోలో.. 

ఈ సమావేశం ముగిసిన అనంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ.. ‘ఉక్రెయిన్‌పై ఒక అవగాహనకు వచ్చాం. యూరప్ దేశాలు ఈ పురోగతిని అడ్డుకోవద్దు. 2022లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే రష్యా మధ్య యుద్ధం జరిగేది కాదు. ఇప్పుడు కొన్ని అంశాలకు పరిష్కారం దొరికింది. పెండింగ్ అంశాలపై మాస్కోలో మరోసారి భేటీ ఉంటుంది’ అని పేర్కొన్నారు. 

జెలెన్‌స్కీ, యురోపియన్ నాయకులతో మాట్లాడతా.. 

ఉక్రెయిన్ అధ్యక్షుడు, యురోపియన్ నా యకులతో మాట్లాడతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ‘ఈ సమా వేశం గురించి నాటో నాయకులు, జెలెన్‌స్కీతో మాట్లాడతా. ఉక్రెయిన్‌పై ఇంకా పూర్తి ఒప్పందం కుదరలేదు. కొన్ని సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. అవి ఏమంత పెద్దవి కా వు. ’ అని పేర్కొన్నారు. 

భారత్‌కు ఉపశమనం కలిగేనా? 

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందనే కారణంతో ట్రంప్ భారత్‌పై సుంకా లతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. అయితే పుతిన్‌తో ట్రంప్ అలస్కాలో భేటీ అయ్యారు. భేటీ తర్వాత ట్రంప్ ఫాక్స్ న్యూస్ తో మాట్లాడారు. ‘రెండు, మూడు వారాల్లో ఆంక్షలపై ఆలోచిస్తాను. వెంటనే ఆంక్షల గు రించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను ఇంకా అధికంగా ఆంక్షలు విధిస్తే వారి పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది’ అని పేర్కొన్నారు. మొన్నటి వరకు రష్యా పే రు చెప్పి సుంకాలతో విరుచుకుపడ్డ ట్రంప్ ప్రస్తుతం సుంకాలు తగ్గిస్తారేమో వేచి చూడాలి.  

పుతిన్‌కు ఇష్టం లేదు: జెలెన్‌స్కీ

అలస్కాలో ట్రంప్ భేటీ సమయంలో కూడా ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడులు ఆగలేదని జెలెన్‌స్కీ ఆరోపించారు. ఈ దాడులు చూస్తుంటే యుద్ధం ముగించేందుకు పుతిన్ సిద్ధంగా లేరని అనిపిస్తోందని విమర్శించారు. భేటీ సమయంలో కూడా దాడులు ఆగట్లేదని ఆరోపిస్తూ దాడులకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.  

యుద్ధం ముగింపు శాంతి ఒప్పందంతోనే సాధ్యం

ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో ఓ ప్రకటన చేస్తూ ఉక్రెయిన్ దేశాలు యుద్ధం ముగించేందుకు ఉన్న అవకాశాలు తెలిపారు. ‘ఈ రెండు దేశాలు నేరుగా శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే మార్గం. ఒక వేళ కాల్పుల విరమణ జరిగినా ఫలితం పెద్దగా ఉండదు. అలస్కాలో పుతిన్‌తో సమావేశం చాలా బాగా జరిగింది. జెలెన్‌స్కీ, నాటో సెక్రటరీ జనరల్, ఐరోపా నేతలతో ఫోన్‌లో మాట్లాడా. జెలెన్‌స్కీ సోమవారం ఓవల్ కార్యాలయానికి రానున్నారు. అన్ని సవ్యంగా సాగితే పుతిన్‌తో సమావేశం ఏర్పాటు చేస్తాం’ అని పోస్ట్ చేశారు. 

చర్చలు శుభపరిణామం: భారత్

అలస్కాలో జరిగిన ట్రంప్ భేటీని భారత్ స్వాగతించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. ‘ట్రంప్ పుతిన్ సమావేశం శుభపరిణామం. శాంతి దిశగా ఇద్దరు నేతల ప్రయత్నాలు ప్రశంసనీయం. చర్చలు, దౌ త్యం ద్వారానే రష్యా స మస్య పరిష్కారం అవుతుంది. వీలైనంత త్వరగా ఈ విపత్తుకు తెరప డాలి’ అని పేర్కొంది. 

రేపు జెలెన్‌స్కీ భేటీ

పుతిన్‌తో సమావేశం అనంతరం ట్రంప్ జెలెన్‌స్కీ, యురోపియన్ నేతలతో ఫోన్‌లో మాట్లాడారు. అలస్కా నుంచి తిరుగుపయనంలో ట్రంప్ యురోపియన్ నాయకులకు ఫోన్ చేశారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ తెలిపారు. ట్రంప్ తనకు ఫోన్ చేసినట్టు జెలెన్‌స్కీ కూడా ధృవీకరించారు. సోమవారం వాషింగ్టన్ డీసీలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయి.. యుద్ధాన్ని ముగించేందుకు కావాల్సిన విషయాలను చర్చిస్తానని జెలెన్‌స్కీ తెలిపారు.