11-10-2025 01:15:22 AM
మందమర్రి జీఎంకు ఏఐటీయూసీ వినతి
బెల్లంపల్లి అర్బన్, అక్టోబర్ 10: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్ వెనకాల గల సౌత్ కాస్కట్ గని కబ్జాపై చర్యలు తీసుకోవాలని ఏఐటియుసి గుర్తింపు సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం బొగ్గు గని భకబ్జాపై మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ కలసి వినతి పత్రం అందజేశారు. భూమి కబ్జా కాకుండా చూడవలసిందిగా కోరారు.
కబ్జా భూమిని సింగరేణి స్వాధీనంలోకి తీసుకోవాల్సిందిగా కోరుతూ మెమొరండం అందజేశా రు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి వెంకట స్వామి మాట్లాడుతూ.. బెల్లంపల్లి పట్టణంలో 1928 లో సింగరేణి బొగ్గు గనులు ప్రారంభించడం జరిగిందన్నారు. పట్టణంలో అనేక బొగ్గు గనులతో కార్మిక బస్తీలతో నిండు పున్నమి చంద్రు నిలా పట్టణం వికసించేదనీ తెలిపారు.
సింగరేణి కంపెనీకి 80 సంవత్సరాలుగా సిరులు అందించిన పట్టణంలో బజార్ ఏరియాకు సౌత్ క్రాస్ కట్ బొగ్గు గని నడిచిందన్నారు. ఈ గనికి అనుకొని క్యాంటీన్, ఎస్‌ఎంపిసి ఆఫీస్, కోల్ శాంపిల్ ఆఫీస్, సివిల్ డిపార్ట్మెంట్, లాంప్ క్యాబిన్ కార్యాలయం కూడా ఉండేవనీ వివరించారు. కన్యకా పరమేశ్వరి దేవాలయం, పద్మశాలి ఫంక్షన్ హాల్ స్థలంలో సివిల్ డిపార్ట్మెంట్ కాంట్రాక్టు క్యాజువల్ వర్కర్స్‌ను డిస్ట్రిబ్యూషన్ చేసే ఆఫీసు, సిమెం ట్ పోల్స్ సిమెంట్ ఇటుకలు ఈ స్థలంలో తయారు చేసే వారనీ పేర్కొన్నారు, సింగరేణి అధికారులు గతంలో పని చేసిన వారు ఇట్టి స్థలాన్ని రెండు దేవాలయాలకు ఇవ్వడం జరిగిందన్నారు.
పద్మశాలి భవన్లో ఇప్పటికే సిం గరేణి యాజమాన్యం ఇచ్చిన స్థలం కాం పౌండ్ వాల్ లోపల ఇంకా ఖాళీ స్థలం ఉన్నప్పటికీ కాంపౌండ్ వాల్ అవతల దేవుని విగ్ర హాల పేరట పూజలతో ఖాళీ స్థలాన్ని కబ్జా చేయడం సమంజసంగా లేదన్నారు. ఈ విషయంలో సింగరేణి యాజమాన్యం, సింగరేణి అధికారులు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని, ఎమ్మెల్యేపై వాస్తవాలను అర్థం చేసుకొని అట్టి స్థలాన్ని ఖాళీ చేయించడానికి సింగరేణి యాజమాన్యానికి సహకరించాలనీ కోరారు. కబ్జాదారులను ప్రోత్సహించడం ఏమాత్రం భావ్యం కాదన్నారు.
సీఎండి బలరాం వాస్తవాలను తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామనీ విజ్ఞప్తి చేశారు. మూసివేసిన ఎక్స్పో్లరేషన్ డివిజన్ ఆఫీసు, ఏజెంట్ ఆఫీసు, వర్క్ షాప్, పవరోజ్ ఓల్ సి ఎస్ పి, మమ్మద్ హుస్సేన్ షెడ్ టింబర్ యాడ్, ఓల్ జిఎం ఆఫీస్, టిం బర్ డిపార్ట్మెంట్ ఆఫీసల భూములను కాపాడాలని జయం రాధాకృష్ణన్ కు విజ్ఞప్తి చేశారు. సింగరేణి యాజమాన్యం సింగరేణి స్థలాలను కబ్జాకోరుల నుండి కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నామని కోరారు.
పద్మశాలి భవన్ ముందు నిర్మించిన అక్రమ కట్టడాలను నిలిపివేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియూసి బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్ , బ్రాంచ్ సహాయ కార్యదర్శి తిరుపతి గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య,బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి, బెల్లంపల్లి పట్టణ సహాయ కార్యదర్శి తిలక్ అంబేద్కర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్, జిల్లా సమితి సభ్యులు రత్నం రాజం తదితరులు పాల్గొన్నారు.