calender_icon.png 12 October, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయ ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి సింగిరెడ్డి

11-10-2025 01:20:39 AM

కల్వకుర్తి అక్టోబర్ 10 : పట్టణంలో నూతనంగా నిర్మించిన సత్యసాయి బాబా ఆలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. మూ డు రోజులపాటు జరగనున్న కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత అలవర్చుకోవాలని దాని వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. సత్యసాయి సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో భగ వాన్ శ్రీ సత్యసాయి నూతన ఆలయం ని ర్మించుకోవడం అభినందనీయమని ప్రశంసించారు.

కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు సత్యం, రాచోటి శ్రీశైలం, మాజీ మా ర్కెట్ చైర్మన్ విజయ్ గౌడ్, మాజీ జడ్పిటిసి నరసింహ, నాయకులు దారమోని గణేష్, సుశీల, వహీద్ , శేఖరగౌడ్, శ్రీనివాసులు, రవి, జ్యోతయ్య వెంకటయ్య, దేవయ్య, కృష్ణ, బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొనడంపాల్గొన్నారు.