calender_icon.png 12 October, 2025 | 9:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టిక్కెట్ల ఎరకు ఆశావహులు బలి?

11-10-2025 01:13:53 AM

  1. తిరగబడిన రిజర్వేషన్లు 

‘హస్తమా...’ మజాకా...

వెలుగుచూసిన అవినీతి కోణం 

నిండా మునిగిన ఔత్సాహికులు 

బెల్లంపల్లి అర్బన్, అక్టోబర్ 10 : ఎన్నికల వేళ ఎన్నో చిత్రవిచిత్రాలు దర్శనమిస్తాయి. అందులో వినూత్నాలు, అవినీతులు, ఓటర్ల ప్రసన్నo కోసం పడరానిపాట్లు వంటివీ చూశాం. కానీ ఎన్నికల రిజర్వేషన్లకు ముందే ఆశా వహులను నమ్మించి అందిన కాడికల్లా దండుకునే సంఘటనలు రాజకీయాల్లో కోకోల్లలు... సరిగ్గా ఇలాంటి అవినీతి కోణం బెల్లంపల్లిలోని ప్రధాన పార్టీలో చోటు చేసుకుంది.

స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పిటీసీ ఎన్నికల్లో పదవులను ఆశిస్తున్న వారి నుంచీ లక్షల రూపాయలు గుంజుతున్నారు. టిక్కెట్ కు రూ. 2 లక్షలు చొప్పున వసూళ్ళుకి పాల్పడిన సంఘటన హస్తం పార్టీలో కలకలం రేపుతుంది. రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోవడంతో టికెట్ కోసం లక్షలు ముట్టజెప్పిన ఆశావహులు కంగుతిన్నారు.

తిరగబడిన రిజర్వేషన్లు..

టికెట్ కోసం లక్షలు చెల్లించి ముందే ఆయా స్థానాలు రిజర్వ్ చేసుకున్నారు. రిజర్వేషన్లు తిరగబడడంతో ఆశావహుల ఆశలు ఆవిరైపోయాయి. రిజర్వేషన్లు ఫలిస్తాయో.. లేదో... ఆలోచించకుండా టిక్కెట్లను ఆశించి తీరా బంగపడిపోయిన ఆశావాహుల పరిస్థితి కడుదయనీయంగా మారింది. తొలి విడతగా నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఔత్సాహికుల ఆశలు వమ్మయి పోయాయి.

రిజర్వేషన్లూ కలిసి రాకపోవడంతో ఇచ్చిన డబ్బులను తిరిగి నోచుకోలేని పరిస్థితిలో ఆశావహులు కొట్టుమిట్టాడుతున్నారు. బెల్లంపల్లి, కాసిపేట, కన్నెపల్లి, తాండూరు, భీమిని, నెన్నెల, వేమనపల్లి మండలాల్లో ఎన్నికల్లో బరిలో ఉన్న ఆసక్తులు నిండా మునిగారు.

ఒక్కో ఆశావహు డు టికెట్ బ్రోకర్లకు లక్షలు ముట్టజెప్పి ఆర్థికంగా నష్టపోయారు. ఇలా లక్షల రూపాయ లు నియోజక వర్గంలో ప్రతి మండలంలోనూ మోసపోయిన ఆశావహులు ఉన్నా రు. చేసేదేమీ లేక తలలు పట్టుకొని లబోది బోమంటున్నారు. 

‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి...‘వలే మోసపోయిన ప్రజాప్రతినిధుల పరిస్థితి ఉంది. టికెట్ల పేరిట లక్షలు కాజాజేసి కుచ్చు టోపి పెట్టిన ఘనులు స్థానిక ప్రజాప్రతినిధికి అత్యంత సన్నిహితులని జోరుగా ప్రచారo జరుగుతుంది. ఎన్నికల వేళ ఓటర్లకు ముందుగానే ఆశావహులు ఇలా మూడుపులు చెల్లించుకొని అడ్డంగా మోసపోవడం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.