17-09-2025 10:53:08 PM
చిట్యాల,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజూరైన చెక్కులను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లబ్ధిదారులకు బుధవారం పంపిణీ చేశారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని పలువురు ఇటీవల అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స పొందగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు. మాదగోని రాములు 46,500, కేస విజయ లక్ష్మి 24,000, బోయ వెంకన్నకు 9000 వేల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, సుఖేoదర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.