19-05-2025 12:00:00 AM
సిద్దిపేట, మే 18 (విజయక్రాంతి): సిద్ధిపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం స్వర్ణోత్సవాల్లో భాగంగా ఆదివారం వైనతేయ ఇష్టి ( కాలసర్ప దోష నివారణ , సత్ సంతాంభివృద్ధి ) హోమాన్ని వేద పండితులు నిర్వహించారు. అనంతరం ధ్వజా రోహణం జరిగింది. అంతకు ముందు విష్వక్సేన ఆరాధన , పుణ్యావచనం, యాగశాల ప్రవేశం, శాంతి పాఠం, ఆరణి మథనం, అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు.
సాయంత్రం భేరి పూజ, దేవతాహ్వానము జరిగింది. స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ్ చిన జీయర్ స్వామి, వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమాలలో ఆలయ ఛైర్మన్ రమేష్ విష్ణు, కార్యనిర్వహణాధికారి విశ్వనాథశర్మ, డైరెక్టర్లు దాస శ్రీనివాస్, బుర్ర శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నారు.