calender_icon.png 29 October, 2025 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి

29-10-2025 12:00:00 AM

మోతె, అక్టోబర్ 28:-  మండల కేంద్రంలొనీ రైతు ఉత్పత్తిదారుల కేంద్రంలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు డైరెక్టర్ లు, రైతులు ఆఫీస్ ముందు మంగళవారం ఆందోళనకు దిగారు.  ఈ సందర్భంగా పలువురు డైరెక్టర్ లు మాట్లాడుతూ గడి సిన రెండు సంవత్సరాల క్రితం పది మంది కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఒక్కొక్కరి నుండి రూ.4 వేలు వసూల్ చేసి మొత్తం సుమారుగా 40 వేలు ఖర్చు పెట్టి  రిజిస్టర్ చేసినట్లు తెలిపారు.

ఈ కమిటీకి అధ్యక్షుడిగా గోళ్ళ మధుసూదన్ రెడ్డి, కోశాధికారిగా దోసపాటి రాములు పేరుతో బ్యాం కులోని జాయింట్ అకౌంట్‌లో సుమారు 3 లక్షల 50 వేలు జమ అయినట్లు తెలిపారు. ఈ నగదు జమ అయిన తదుపరి ఎటువంటి తీర్మానాలు, ఆధారాలు లేకుండా అధ్యక్షుడు,  కోశాధి కారినీ తొలగించి అప్పటివరకు ఉపాధ్యక్షుడిగా ఉన్న బొక్క ఉపేందర్ రెడ్డి అధ్యక్షుడిగా కొనసా గారన్నారు.

తదుపరి తన ఇష్టం వచ్చిన వారిని ఇతర పదవుల్లో నియ మించుకొని జాయింట్ అకౌంట్‌లో జమ అయిన డబ్బులకు లెక్కలు చెప్పడం లేదని ఆరోపిం చారు. నేటి వరకు సుమారు రూ. 10 లక్షలకు పైనే అక్రమాలు  జరిగాయన్నారు. దీనిలో యఫ్ ఏ ఓ శ్రీనివాస్ రావు, సి ఇ ఓ సతీష్ లు అధ్యక్షులు బొక్క ఉపేందర్ రెడ్డిల పాత్ర ఉందని ఆరోపించారు.  రైతు ఉత్పత్తి దారుల కేంద్రం అకౌంట్లో జమైన నగదు గురించి అడిగిన డైరెక్టర్ లను పోలిసులతో కేసులు నమోదు చేయిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు.   

ఈ కమిటీ అధ్యక్షుడే తన బిడ్డ సిఈఓగా, భార్య ను మరో పోస్ట్ లొపెట్టీ ఒకే కుటుంబానికి చెందినవారే రైతుల పేరుతో సొసైటీని ఏర్పాటు చేశారంటే ఇక్కడ జరుగుతున్న పరిస్థితిని అధికారులు అర్థం చేసుకోవాల న్నారు. సొసైటీ సొమ్మును కాజేస్తున్న అధ్యక్షునిపై, అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.