29-10-2025 12:00:00 AM
కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ, అక్టోబర్ 28 (విజయక్రాంతి): ప్రజల భద్రత కోసం నిరంతరం పనిచేస్తున్న పోలీసులు ప్రజల శ్రేయోభిలాషులని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా గాయత్రీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ ను మంగళవారం కలెక్టర్ ప్రారంభించారు.
ఈ ఓపెన్ హౌస్ విక్షీంచేందుకు నగరంలోని పలు విద్యా సంస్థల నుండి వచ్చిన విద్యార్థులకు.. పోలీసులు నిర్వహిస్తున్న విధులు, వారు వినియోగించే వివిధ రకాల ఆయుధాలు, వాటి పనితీరు, అలాగే బాంబు డిస్పాజల్, డాగ్ స్క్వాడ్ విభాగాల పనితీరును సంబంధిత పోలీస్ అధికారులు, సిబ్బంది చిన్నారులకు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. తమ కుటుంబ క్షేమం కన్నా.. సమాజ క్షేమం కోసం నిరంతరం శ్రమించేది. పోలీసులు మాత్రమేనని, పోలీసులను మీ స్నేహితులుగా భావించాలని, ప్రాణ త్యాగాలు చేసిన పోలీస్ అమరవీరులను మరువద్దని తెలిపారు. ఈ కార్యక్రమం లో డీసీపీ రాజ మహేంద్ర నాయక్, ఏసీపీ పండేరి చేతన్, సిఐ సత్యనారాయణ, ఎస్.ఐ లు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.