calender_icon.png 29 October, 2025 | 7:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచినీళ్ల కోసం రోడ్డెక్కిన మహిళలు

29-10-2025 12:00:00 AM

బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో రాస్తారోకో 

వాజేడు, అక్టోబర్28 (విజయక్రాంతి): ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో గత 20 రోజులుగా మంచినీళ్లు రాకపోవడంతో ఆగ్రహించిన జనం కాలిబిందెలతోరోడ్డెక్కారు.మంగళవారం బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్ ఎదురుగా రాస్తారోకో నిర్వహించారు. గత 20 రోజులుగా నీళ్లు  రాకపోవడంతో అనేక ఇబ్బందులకు గురి అవుతున్నామని, తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఎదురైందని,అధికారులకు చెప్పినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేక పోవడంతో రాస్తారోకో నిర్వహించడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత అధికారులు  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మండిపడ్డారు. స్థానిక ఎంపీడిఓ ఎంపీడీవో వచ్చి ప్రజలనుసర్దిచెప్పే ప్రయత్నం చేయగా ఇన్ని రోజులుగా నీళ్లు రాకుండా అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే అధికారులు నిమ్మకు నీరు ఎత్తనట్టుగా ఉండటం మంచి పద్ధతి కాదని బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి గారు ప్రశ్నించారు. మరమ్మత్తులను వెంటనే చేయించి 24 గంటలు దాటకుండా నీళ్లు ఇచ్చే లాగా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి కలెక్టర్  దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.

ఎంపీ ఓ శ్రీకాంత్ నాయుడు స్పందిస్తూ తక్షణమే చర్యలు తీసుకుంటామని ప్రజలకు ఇబ్బంది కలగకుండా నీళ్లు వచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పడంతో రాస్తారోకో విరమించారు.   బిఆర్‌ఎస్ మండల యూత్ ప్రెసిడెంట్ ముడిగతిరుపతి యాదవ్, సిరుమర్తి శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ కల్లూరు సతీష్, వెంకట్ రెడ్డి, మీనయ్య, సాయి, ఎట్టి పాపారావ జంపాలదేవి, తంగిళ్ళపల్లి, రమాదేవి శారద , అనసూర్య, వెంకట నర్సు ఇంకా అనేకమంది మహిళలు పాల్గొన్నారు.