22-09-2025 01:25:08 AM
ఎస్పీ రాజేష్ మీనా
నిర్మల్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): జిల్లాలో మైనర్లు వాహనాలు నడిపితే చర్య లు కఠినంగా ఉంటాయని జిల్లా ఎస్పీ రాజేష్ మీనా అన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణంలో వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కిన మైనర్లకు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.
మైనర్లు వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పిల్లల అలవాట్లపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ ప్రవీణ్ కుమార్ పోలీసులు పాల్గొన్నారు