calender_icon.png 22 September, 2025 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు

22-09-2025 01:20:55 AM

  1. ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం

ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల

జలాశయం నీటిమట్టం 587.60 అడుగులు

నాగార్జునసాగర్, సెప్టెంబర్ 21(విజయక్రాంతి)ః నాగార్జునసాగర్ ప్రాజెక్టు భారీగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది,ఆదివారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 3,38,437 క్యూసెక్కుల నీరు సాగర్ ప్రాజెక్టుకు వచ్చి చేరుతుండడంతో  అధికారులు 26 రేడియల్ క్రస్ట్ గేట్లను ఎత్తి 2,84,316 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఇందులో 14 గేట్లు ఐదు అడుగులు,12 పది అడుగుల ఎత్తి విడుదల చేశారు.

జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు,కాగా ప్రస్తుత నీటిమట్టం587.60 అడుగులకు చేరుకుంది,ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుతం 305.8626,టీఎంసీల నీరు నిల్వ ఉంది,సాగర్ నుంచి కుడి కాల్వ ద్వారా 9,500, క్యూసెక్కులు,

ఎడమ కాల్వ ద్వారా 8,629,క్యూసెక్కులు, జలాశయం ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 33,292,క్యూసెక్కులు ఎస్‌ఎల్బీసీ ద్వారా 2,400,క్యూసెక్కులు,వరద కాలువ ద్వారా 300 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతుంది,అదేవిధంగా ప్రాజెక్టు నుంచి అవుట్ ఫ్లో పూర్తిస్థాయిలో 3,38,437 క్యూసెక్కుల నీరు దిగువకు కొనసాగుతుంది.