calender_icon.png 22 September, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హత్య కేసులో నిందితుడి అరెస్ట్ వివరాలు వెల్లడించిన రెబ్బెన సీఐ ఎం.సంజయ్

22-09-2025 01:26:40 AM

రెబ్బెన, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని నారాయణపూర్‌లో కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా గొడ్డలిలో నరికి చంపిన భర్తను రెబ్బెన పోలీసులు అరెస్టు చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు. సీఐ సంజయ్ మాట్లాడుతూ నారా యణపూర్‌కు చెందిన గజ్జల తిరుపతి టాటా ఏస్ వాహనం డ్రైవర్‌గా పని చేసేవాడు. అతనికి చిన్నబుదెకు చెందిన స్రవంతితో 21 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.

గత కొంతకాలంగా మద్యానికి భానిసగా మారిన తిరుపతి తరుచు భార్యతో గొడవపడేవాడు. అందులో భాగంగానే భార్యను ఎలాగైనా వదిలించుకోవాలని పథకం ప్రకారం శనివారం తెల్లవారుజామున స్రవంతిని గొడ్డలితో కిరాతకంగా నరికి చంపి అక్కడి నుండి పరారయ్యాడు. మృతురాలి తమ్ము డు సంజయ్ అందించిన పిర్యాదుతో నింది తుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు.