calender_icon.png 30 August, 2025 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు

30-08-2025 01:53:00 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి ఆగస్టు 29 :  వ్యాపారులు యూరియాను కృత్రిమ కొరత సృష్టిస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో కల్వకుర్తి , వెల్దండ, చార కొండ, ఊరుకొండ మండలాల వ్యవసాయ అధికారులు, వ్యాపారులతో యూరియా కొరతపై సమీక్ష నిర్వహించి మాట్లాడారు. పంటల సాగుకు సరిపడ యూరియా అందుబాటులో ఉన్నా రైతులు ఆందోళన చేపట్టే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు.

వ్యాపారులు నిల్వ చేసుకొని కొరత ఉందంటూ అధిక ధరలకు గోప్యంగా విక్రయించడంతో ఇలాంటి సమస్యలు వస్తున్నాయని అధికారులు ఎప్పటికప్పుడు దుకాణాలను తనిఖీ చేసి నిలువలను పరిశీలించాలని ఆదేశించారు. రైతులను ఇబ్బందుల గురిచేస్తే వారిపైన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై యాంత్రికరణ పనిముట్లు అందజేస్తుందని రైతులు వాటి సద్విని చేసుకోవాలని సూచించారు. కార్యక్ర మంలో ఎమ్మార్వో ఇబ్రహీం, ఏడిఏ కిరణ్ కుమార్, ఏవోలు సురేష్, శోభ, మార్కెట్ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులుపాల్గొన్నారు.