30-08-2025 01:50:44 AM
శ్రీరంగాపురం, ఆగస్టు 29.కాంగ్రెస్ ప్రభుత్వం పేదింటి ఆడపడుచులకు అండగా ఉంటూ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అమలు చేస్తూ నిరంతరం పేదల అభివృద్ధి కోసం పనిచేస్తుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం పెబ్బేర్ ఎంపీడీవో కార్యాలయంలో శ్రీరంగాపురం మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించి 33 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పంపిణీ చేశారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ, సబ్బండ వర్గాల ప్రజలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మీ పథకం ఆర్థికంగా ఎంతో తోడ్పాటును అందిస్తుందని తెలిపారు. మహిళల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్ర త్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం
- ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
- డీ సీ సీ బీ కొత్త భవనం ప్రారంభం
వనపర్తి టౌన్ ఆగస్టు 30: పేద ప్రజలకు ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. ముందుగా జిల్లా కేంద్రంలో పునర్నిర్మించిన జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ మహబూబ్ నగర్ వనపర్తి బ్రాంచ్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి జిల్లా డి సి సి బి అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి లతో కలిసి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు.అనంతరం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన వ నపర్తి పట్టణం మరియు వనపర్తి మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సి యం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ ఈ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేద వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి మూడు సంవత్సరాల లో గుడిసె లేని నియోజకవర్గంగా చేస్తానన్నారు. ఈ ప్రజా ప్రభుత్వం ఈ ఇందిరమ్మ రాజ్యం బడుగు బలహీన వ ర్గాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు వనపర్తి పట్టణ అధ్యక్షులు మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.