calender_icon.png 11 August, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తే చర్యలు

06-08-2025 12:11:32 AM

సూర్యాపేట పట్టణ సీఐ వెంకటయ్య

సూర్యాపేట, ఆగస్టు 5 (విజయక్రాంతి) : చిరు వ్యాపారులు రోడ్లను ఆక్రమించి ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని పట్టణ సీఐ వెంకటయ్య సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ నరసింహ  ఆదేశాల మేరకు పట్టణ ట్రాఫిక్ ఎస్‌ఐ సాయిరాంతో కలసి కుడ కుడ రోడ్డులో పర్యటించి దుకాణదారులు బోర్డులు ఇతర సామాగ్రి ఏర్పాటు చేయగా వాటిని తొలగించి మరోసారి పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా వ్యాపారాలు చేసుకుంటే మంచిదని తెలిపారు. పట్టణ ప్రజలు ఎదురుకుంటున్న ట్రాఫిక్ ఇబ్బందులను ప్రజల సహకారంతో రోడ్డులపై ఉన్న ఆక్రమణలను తొలిగించి పాదచారాలుకు, వాహనదారులకు ఎదురు అవుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.