10-07-2025 01:05:04 AM
- జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్
- పద్మారావునగర్ నాలా పనుల పరిశీలన
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 9 (విజయక్రాంతి): ముషీరాబాద్ సర్కిల్ నాగమయ్య కుంట నుంచి పద్మారావునగర్ వరకు చేపట్టిన నాలాను జిహెఎంసి కమిషనర్ ఆర్వీ కర్ణన్ బుధవారం పరిశీలించారు. గతంలో ఎస్‌ఎన్‌డి ద్వారా చేపట్టిన నాలా అభివృద్ధి పనులను ఇతర కారణాల వల్ల చివరి భాగంలో పూర్తి కాలేదు.
అసంపూర్తిగా ఉన్న నాలా పనులు సత్వరమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అందుకు కావలసిన నిధుల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపాలని ఇంజనీరింగ్ అధికారుల ను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కమిషనర్ వెంట జోనల్ కమిషనర్ రవి కిరణ్, డిప్యూటీ కమిషనర్ రామ సుజారెడ్డి, జోనల్, సర్కిల్ స్థాయి ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.