calender_icon.png 10 July, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగిత్యాల జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కృషి

10-07-2025 01:03:52 AM

  1. అన్ని రంగాల్లో ముందు ఉంచుతా

పుష్కరాల వరకు ధర్మపురి క్షేత్రాన్ని తీర్చిదిద్దుతాం

పేదలకు అండగా నిలుస్తా..

రైతులకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక దృష్టి సారించండి

సాగు, తాగునీరు విషయంలో అప్రమత్తంగా ఉండాలి

అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి

నిధులు తెచ్చే బాధ్యత నాది

ప్రభుత్వ పథకాలు పేదలకు అందేలా చూడాలి

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కరీంనగర్/జగిత్యాల, జూలై9(విజయక్రాం తి): జగిత్యాల జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కృ షి చేస్తానని, అన్ని రంగాల్లో జిల్లాను ముందు ఉంచుతానని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరీ లక్ష్మ ణ్ కుమార్ పేర్కొన్నారు. ఇందుకోసం జిల్లా అధికారులు సహకరించాలని, చిత్తశుద్ధితో ప నిచేయాలని సూచించారు. బుధవారం జగిత్యాల కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధిపై మంత్రి లక్ష్మణ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమీక్షలో ఎమ్మెల్సీ రమణ, జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, కే సంజయ్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. సాగునీరు, తాగునీరు, విద్యా, వైద్యము, వ్యవసాయము పౌరసరఫరాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖ,రోడ్లు భవనాల శాఖ ధర్మపురి లక్ష్మీనరసింహస్వా మి ఆలయం, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధితోపాటు వివిధ అంశాల పై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి లక్ష్మ ణ్ కుమార్ మాట్లాడుతూ 2027 సంవత్సరంలో ధర్మపురి క్షేత్రంలో గోదావరి పుష్కరా లు జరగనున్నాయని, వీటిని అద్భుతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. పుష్కరాల్లో భాగంగా ఇప్పటినుంచే ధర్మపురి క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు చర్య లు తీసుకుంటామని తెలిపారు.

ధర్మపురిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల సహకారంతో చర్చించి తగిన నిర్ణయం తీసు కుంటామన్నారు. జగిత్యాల జిల్లాలో అధిక శాతం మంది వ్యవసాయ రంగంపైనే జీవిస్తున్నారని, రైతులకు సాగునీరు విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

అదేవిధంగా తాగునీటి విషయంలోనూ ప్రజలు ఇబ్బందులు పడకుం డా జాగ్రత్త పడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. వ్యవసాయ సీజన్ కాబట్టి గ్రా మాల్లో యూరియా కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జగిత్యాల జిల్లాను అన్ని రంగాల్లో ముందు ఉంచుతానని, అధికారులు సహకరించాలని పేర్కొన్నారు.

అధికారులు బాధ్యతయుతం గా విధులు నిర్వర్తిస్తూ పేదలకు అండగా నిలవాలని, అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని సూచించా రు.. అభివృద్ధి విషయంలో ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి, మంత్రులతో మాట్లాడి నిధులు తెచ్చే బాధ్యత తాను తీసుకుంటానని పేర్కొన్నారు.

ప్రభుత్వపరంగా జిల్లా అభివృద్ధికి ఏ విధం గా మేలు జరుగుతుందని అంశంలో తను ఎల్లప్పుడూ ముందుంటానని, ఆ విధంగా ఆ లోచించి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చేస్తానని పేర్కొన్నారు. గతంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో తన శా ఖకు వన్నెతెచ్చే విధంగా పనిచేస్తానని తెలిపారు. 

జిల్లాలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగు ల సంక్షేమానికి ప్రత్యేకంగా కృషి చేస్తానని చెప్పారు. జగిత్యాల లో నూతన డిగ్రీ కాలేజ్, స్టడీ సర్కిల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో ప్రభుత్వ పథకాలు 100కు 100% అమలు చేయడంలో అధికారులు బాధ్యతయుతంగా పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణం గా నిబంధనల మేరకు పనిచేయాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తగిన చర్యలు తీసు కుంటామన్నారు.