calender_icon.png 10 July, 2025 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ విద్యార్థులందరికీ ‘మోదీ కిట్స్’

10-07-2025 01:05:52 AM

  1. మోదీ స్పూర్తితోనే ఈ సైకిళ్ల పంపిణీ
  2. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

కరీంనగర్, జూలై 9 (విజయ క్రాంతి): అ ది త్వరలోనే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ మోడీ కిట్స్ అందజేస్తామని, నీకు అం దిస్తున్న సైకిళ్ళు మోడీ గిఫ్ట్ అని, ఆయన స్ఫూర్తితోనే ఈ సైకిళ్ళు పంపిణీ చేస్తున్నానని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సం జయ్ కుమార్ అన్నారు.

బుధవారం క రీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో పదవ తరగతి చదివే విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశా రు. మొత్తం 20 వేల సైకిళ్లను స్వయంగా కొ నుగోలు చేసిన బండి సంజయ్ వాటిని దశ ల వారీగా పంపణీ చేసే కార్యక్రమానికి శ్రీకా రం చుట్టారు. తొలుత కరీంనగర్ టౌన్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చ దువుతున్న విద్యార్థులందరికీ సైకిళ్లను పంపి ణీ చేశారు. 

ఈ సందర్భంగా బండి సంజయ్‌కుమార్ మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అండగా ఉంటూ సమాజానికి సేవ చేయాలని మాలో ఎప్పటికప్పుడు స్పూర్తినింపిన నాయకుడు ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆయన బాటలో నడుస్తూ మాకు చేతనైనం త సాయం చేస్తున్నామన్నారు. ఈ సైకిళ్ల పం పిణీ ఆలోచన ఇచ్చిందే జిల్లా కలెక్టర్ అని, బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో బాలికలకు సైకిళ్లు ఇస్తే బాగుంటుందని కలెక్టర్ ప్రతిపాదించారని తెలిపారు.

ఆ ఆలోచన తోనే పదవ తరగతి విద్యార్ధినీ, విద్యార్థులందరికీ సైకిళ్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇవి ప్రభుత్వ నిధులు కావని, అట్లని నేను కోట్లు ఖర్చు పెట్టేంత సంపన్నుడిని కాదని, మా దగ్గరకు వచ్చిన కొందరు కార్పొరేట్ కంపెనీల యాజమానులను మీరు సంపాదించిన సొమ్ములో కొంత సీఎస్సార్ ఫండ్ కింద ఇ వ్వాలని కోరితే వారు సానుకూలంగా స్పం దించి ఆ నిధులు అందిస్తే వాటితో సైకిళ్లను కొని మీకు పంపిణీ చేస్తున్నానని అన్నారు.

నేను కూడా చిన్నప్పటి నుండి మీలాగే పేదరికంలో పెరిగానని, తినడానికి ఇబ్బంది  పడ్డానని, మా తల్లిదండ్రులు మమ్ముల్ని ఎం తో కష్టపడి చదివించారని అన్నారు. కష్టాలు తెలిసిన వ్యక్తిని కాబట్టే మీరు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని సైకిళ్లను పంపిణీ చేస్తున్నానని అన్నారు. జిల్లా కలెక్టర్ ఈ విషయంలో రోల్ మోడల్ అని, ఒడిశా నుండి వచ్చి కష్టపడి పనిచేస్తూ మీ అందరికీ స్పూ ర్తిగా ఉన్నారన్నారు.

పోలీస్ కమిషనర్ బీహా ర్ నుండి ఇక్కడికి వచ్చారని, ఆయన తండ్రి మిలటరీలో పనిచేశారని, క్రమశిక్షణతో ఎది గి వచ్చారన్నారు. వీళ్లే కాదు... మహాత్మాగాం ధీ, అంబేద్కర్, మోదీ కూడా పేదరికం నుం డి ఎదిగిన వాళ్లేనని, ముఖ్యంగా అంబేద్కర్ ఎన్ని కష్టాలు అనుభవించారో, అంటరానితనాన్ని ఎదుర్కొన్నారో మాటల్లోచెప్పలేమ న్నారు. ఇప్పుడు మీ కష్టాలను తీర్చడానికి మోదీ ఉన్నాడని, మా హయాంలో ఆదుకు నే వాళ్లే లేరన్నారు.

మోదీ ప్రభుత్వం విద్యా రంగానికి ఎనలేని ప్రాధాన్యమిస్తోందన్నారు. యూపీఏ హయాంలో విద్యా రంగానికి కేం ద్రం 68 వేల 728/కోట్లు మాత్రమే కేటాయి స్తే... ఈ ఒక్క ఏడాదే 1 లక్షా 28 వేల 650/ కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. ఈ 11 సంవత్సరాల్లో ఒక్క విద్యా రంగానికే దాదాపు 8/లక్షల కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేశామంటే విద్యా రంగంపై మోదీ ప్ర భుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్ధం చే సుకోవచ్చన్నారు.

అయితే పాఠశాలలను నడిపే బాధ్యతను, స్థానిక భాషలో పాఠ్యంశాలు బోధించే అంశాలను అమలు చేయా ల్సింది మాత్రం రాష్ట్ర ప్రభుత్వమేనని, ఎం దుకంటే కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతో వి ద్యా రంగం ముందుకు సాగుతుందనే నమ్మకంతోనే ఈ జాతీయ విద్యా విధానాన్ని మో దీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. అతి త్వర లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు అతి త్వరలో “మోదీ కిట్స్ ను అందజేయబోతున్నామని, ఎన్ని వేల మంది ఉ న్నా, ఎన్ని లక్ష ల మంది ఉన్నా వాళ్లందరికీ మోదీ కిట్స్‌ను అందిస్తామన్నారు. తల దించుకుని చదవాలి...

బాగా చదివి తల ఎత్తుకు తిరిగేలా బతకాలని, మిమ్ముల్ని చదివించేందుకు మీ తల్లిదండ్రులు పడుతున్న బాధల ను గుర్తు చేసుకుంటూ బాగా చదవాలన్నారు. నామీద ఇంత అభిమానం కురిపి స్తు న్న పిల్లల రుణం ఏ విధంగా తీర్చుకోవాలని నిరంతరం ఆలోచిస్తున్నానాని, మన స్పూర్తి గా నాకు చేతనైనంతా ఈ సమాజానికి, పిల్లలకు సేవ చేస్తున్నానాని,  అందు లో భాగం గానే ఈ సైకిళ్లను పంపిణీ చేస్తున్నానని అన్నారు.

భవిష్యత్తులో మరిన్ని కార్యక్ర మాలు చేస్తూ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి చేస్తానని, నేను ఎంపీగా ఉన్నంత కాలం ప్రతి ఏటా పదవ తరగతి చదివే వి ద్యార్థులందరికీ సైకిళ్లను, మోదీ కిట్స్ అందజేస్తానన్నారు. ఆయురోగ్యాలం తో నిండు నూరేళ్లు వర్ధిల్లుతూ మిమ్ముల్ని కన్న తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని అమ్మవారిని ప్రార్ధిస్తున్నానని బండి సంజ య్ కుమార్ తెలిపారు. 

ఈ కార్యక్రమంలోఎమ్మెల్సీ మల్క కొమరయ్య, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ అశ్వినీ, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దే శాయ్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజీపీ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మాజీ మే యర్లు డి.శం కర్, సునీల్ రావు, మాజీ డిప్యూ టీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, ఆర్డీవో, డీఈవో, తదితరులుపాల్గొన్నారు.