calender_icon.png 14 August, 2025 | 1:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ ఎన్నారై జవాడే కృష అరెస్ట్

14-08-2025 12:06:32 AM

ఎస్పీ మహాజన్ 

ఆదిలాబాద్, ఆగస్టు 13 ( విజయ క్రాంతి ):మైక్రోఫైనాన్స్ పేరుతో ఎన్.ఆర్.ఐ అంటూ సామాజిక సేవ పేరుతో ఉద్యోగాలు ఇప్పి స్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.

ఆదిలాబాద్‌లోని పోలీ స్ హెడ్ క్వార్టర్స్‌లో బుధవారం ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌సింగ్‌తో కలిసి ఎస్పీ మీడియా తో మాట్లాడుతూ.. ఎస్.కే మైక్రో ఫైనాన్స్ పేరుతో జవాడే కృష అనే వ్యక్తి ఆదిలాబాద్, ఉట్నూర్, నార్నూర్‌ల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సుమారు 300 మంది నుండి 20 వేల నుం డి లక్షల వరకు వసూలు చేశారన్నారు.

నిరు ద్యోగుల నుండి వసూలు చేసిన సుమారు కోటి రూపాయల డబ్బులతో ఉడయించిన కృష్ణపై జిల్లాలోని ఉట్నూర్‌లో 3, ఇంద్ర వెల్లిలో - 3, నార్నూర్‌లో - 2, మావల లో  3, ఆదిలాబాద్ వన్ టౌన్‌లో - 2, జైనథ్ లో - 3 చొప్పున దాదాపు 16 కేసులు నమోదు అయ్యాయన్నారు.

  అరెస్టు చేసిన నిందితుని నుండి 9 లక్షల నగదు, 10.7 తులాల బం గారు ఆభరణాలు, ఐదు మొబైల్ ఫోన్లు, ఒక ఖరీదైన వాచ్, రెండు కార్లు స్వాదీనం చేసుకు న్నామన్నారు. కృష్ణతో పాటు మరో నలుగు రిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో ఉట్నూర్ సీఐ ఎం ప్రసాద్, ఐటీ కోర్ ఎస్సై గోపికృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.