calender_icon.png 14 August, 2025 | 1:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదక ద్రవ్యరహిత సమాజాన్ని నిర్మిద్దాం

14-08-2025 12:04:45 AM

కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

కుమ్రం భీం ఆసిఫాబాద్,ఆగస్టు 13(విజయక్రాంతి): మాదకద్రవ్య రహిత సమాజా న్ని నిర్మిద్దామని, యువతలో మాదకద్రవ్యా ల ప్రభావాన్ని తగ్గిద్దామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవంలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి జిల్లా ఎస్. పి. కాంతిలాల్ పాటిల్ తో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాదకద్రవ్యరహిత సమాజాన్ని నిర్మించి యువతపై చెడు ప్రభావాన్ని పూర్తిగా నిర్మూలిద్దామన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం కారణంగా  జిల్లాలో మాదకద్రవ్య రవాణా, విక్రయం, వినియోగం చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మన తల్లిదండ్రులు మన సంక్షే మం కోసం, ఉన్నతంగా ఎదిగేందుకు ఎంతో కష్టపడతారని, వారి కళలను వమ్ము చేయకుండా వారి నమ్మకాన్ని కాపాడుకోవాలని తెలిపారు. 

ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం, గం జాయి సాగు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా గంజాయి సాగు, బాధక ద్రవ్యాలు కలిగి ఉన్నట్లయితే వారి సమాచారాన్ని పోలీసులు శాఖ అధికారుల కు అందించాలని, అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులతో మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంపై ప్రమా ణం చేయించారు.  ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, సంబంధిత అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.