calender_icon.png 14 August, 2025 | 1:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్లుకు లేదు బిల్లు.. ప్రజల ప్రాణాలకు చెల్లు

14-08-2025 12:04:26 AM

  1. నీళ్ల కల్లుతో వ్యాపారం.. కోట్లలో వ్యాపారం..
  2. మత్తు పదార్థాలు కలుపుతున్నా.. పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు
  3. లంచాల మత్తులో ఆబ్కారీ శాఖ
  4. సర్కిల్‌కు రూ.లక్ష...పీఎస్‌కు రూ.25వేలు 
  5. మద్యం మాఫియా ఆగడాలకు కళ్లెం వేసేదెవరు ?
  6. స్పందించని ఉన్నతాధికారులు
  7. జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు

సంగారెడ్డి, ఆగస్టు 13 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలలో యథేచ్ఛగా కల్తీకల్లు, మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. ఈ మత్తుమందు కలిపిన కృత్రిమ కల్లును తాగి ఎందరో ప్రజలు వ్యాధులకు గురి అవుతు న్నారు. ఈ విషయాన్ని అందరూ అధికా రులు చూస్తున్నా వారిపై చర్యలేమీ లేవు. ఎక్సైజ్ అధికారులు మాత్రం ఇది మాకు మామూలేనంటూ నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారు.

నామమాత్రంగా దుకాణాలను సీజ్ చేసి కల్లు షాంపిళ్లను సేకరించి చేతులు దులుపుకుంటున్నారు తప్పితే ఘటనలకు బాధ్యులైన వారిని ఇంతవరకు అరెస్టు చేయలేదని తెలిసింది. ఇలాంటి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా నామమాత్రపు చర్య తీసుకొని చూసీచూడనట్టు వదిలేస్తున్న అధికారులపై ప్రభుత్వం కఠినమైన చర్య తీసుకొని వాళ్లను అరెస్టు చేసి వాళ్ళ లైసెన్సులను రద్దుచేసి కల్తీకల్లు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అసలు సంగారెడ్డి జిల్లాలో ఉన్న కల్లు చెట్లు ఎన్ని వాటి ద్వారా స్వచ్ఛమైన కల్లు డిపోలకు ఎంత వస్తుంది? వారు ఎంత తయారు చేశారు ?ఎంత విక్రయించారు అనే సమా చారాన్ని ఎక్సైజ్ శాఖ తమ దగ్గర రికార్డుల ద్వారా భద్రపరచుకొని అందులో కల్తీ జరగకుండా చూడవలసిన బాధ్యత ఆ అధికారులపై ఉంది. ఈ కల్తీ కళ్ళు తాగడం వల్ల నరాలు పని చేయక ఎలాంటి పని చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు.

నాలుగు రోజులు కల్లు తాగని పరిస్థితి ఉంటే మతిస్థిమితం కోల్పోయి పిచ్చి పిచ్చి చేష్టలు చేసుకుంటూ ఆసుపత్రిలో చేరుతున్నారు. కల్తీ కల్లు వ్యాపారం కోట్లలో జరుగుతున్నా అధికారులు మాత్రం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. కనీసం కల్లు అమ్మే వ్యాపారులు ఆ కల్లు తీసుకున్న వ్యక్తికి కల్లుకొన్నట్టు రసీదు కూడా ఇవ్వరు. రసీదు లేకుండా అక్కడ కల్లు కొనుగోలు చేసినట్టు ఆధారాలు కూడా ఉండవు.  

సర్కిల్‌కు రూ.లక్ష.. పీఎస్‌కు రూ.25వేలు...

వైన్స్ దుకాణ డీలర్లు, బెల్ట్షాపుల నిర్వాహకులు తమ దందా యథేచ్ఛ గా సాగేందుకు ప్రతీనెల ఎక్సైజ్ సర్కిల్కు వారి పరిధిలోని మద్యం దుకాణాల నుంచి రూ.లక్ష, ప్రతీ పోలీస్ స్టేషన్కు ఒక్కో వైన్స్ నుంచి రూ.25వేలు మామూళ్ల రూపంలో ముట్టజెప్పుతున్నట్లు సమాచారం. ఇంత పెద్ద మొత్తం చెల్లించడం వెనుక పెద్ద రాకెట్ నడుస్తోందని భావిస్తున్నారు.

ప్రతీనెల అందాల్సిన మొత్తం సకాలంలో రాకపోతే పోలీస్ అధికారులు వైన్షాపునకు 70 అడుగుల దూరంలోనే డ్రంకెన్ డ్రైవ్ నిర్వ హిస్తారు. మద్యం ప్రియులు చేసే డిమాండ్ల న్నింటిని పూర్తి చేయాల్సిందిగా వైన్స్ నిర్వా హకులపై ఒత్తిడి తెస్తారు. అదే మామూళ్లు సకాలంలో చేరితే ఎన్ని ఫిర్యాదులు వచ్చినా స్పందించరు. డ్రంకెన్ డ్రైవ్ ఇబ్బందులు తప్పించుకునేందుకు మద్యం బాబులు తమ ఇళ్లకు సమీపంలో ఉండే బెల్ట్షాపులను ఆశ్రయిస్తున్నారు.

దీంతో వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఎక్సైజ్ అధికారులకు చెల్లించాల్సిన మామూళ్లు సకాలంలో చెల్లిస్తే  బెల్ట్షాపులు యథేచ్ఛగా నిర్వహించుకోవచ్చు. ఎలాంటి తనిఖీలు ఉండవు. ఇప్పటికైనా జిల్లా ఎస్పీ, ఎక్సైజ్ ఉన్నతాధికారులు స్పందించి మద్యం వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.