07-10-2025 01:02:43 AM
మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు
ఆళ్ళపల్లి, అక్టోబర్6,(విజయక్రాంతి):స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్‌ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు బీఆరెస్ జిల్లా అధ్య క్షులు రేగ కాంతారావు పిలుపునిచ్చారు సోమవారం మండల పరిది లోని మర్కోడు గ్రామంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ప్రజలను దగా చేసిందన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన రెండు సంవత్సరాల్లోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారని.
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడుదల చేసిన కాంగ్రెస్ బాకీ కార్డును ప్రతి ఇంటికి చేరవేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి, టిఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిచేలా కృషి చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు టిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కొమరం హనుమంతరావు మాజీ ఎంపీపీ కొండు మంజు భార్గవి పిఎసిఎస్ చైర్మన్ గుగ్గల మామయ్య మండలాధ్యక్షుడు పాయం నరసింహారావు ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కిషోర్ బాబు, పొదిల రాము, నరసింహారావు, శంకర్, బాబు, వెంకటకృష్ణ, ఆదాం, సందీప్, నరేష్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.