07-10-2025 01:02:39 AM
సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు
సుల్తానాబాద్, అక్టోబర్ 6 (విజయ క్రాంతి):మున్సిపల్ యూనియన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు పిలుపునిచ్చారు, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఐదవ మహాసభల పోస్టర్లను సోమవారం సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఆవిష్కరించారు,
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ అక్టోబర్ 14, 15 తేదీలలో మున్సిపల్ యూనియన్ రాష్ట్ర మహాసభలు రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ లో జరుగుతున్నాయని మొదటి రోజు ర్యాలీ, బహిరంగ సభ ఉంటుందని రెండవ రోజు ప్రతినిధుల సభ ఉంటుందని, ఈ మహాసభల్లో మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి రాబోయే రోజుల్లో ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని.
కనీస వేతనం 26 వేల సాధన, పర్మినెంట్, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం తీర్మానాలు చేస్తారని అన్నారు, మున్సిపల్ కార్మికుల భవిష్యత్తు కోసం జరుగుతున్న ఈ మహాసభల్లో పెద్దపల్లి జిల్లాలోని మున్సిపల్ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు,
ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పాక మహేష్, సుల్తానాబాద్ మండల సిఐటియు కన్వీనర్ తాండ్ర అంజయ్య, రైస్ మిల్ గుమస్తాల సంఘం అధ్యక్షుడు మాతంగి రాజమల్లు, సుల్తానాబాద్ మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు న్యాతరి రమేష్, నాయకులు మల్లేష్ , లక్ష్మి, రామ్మూర్తి, శ్రీనివాస్, అనిల్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.