04-11-2025 12:00:00 AM
సూర్యాపేట, నవంబర్ 3 (విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మణిముఖుర జ్యువెలర్స్ను జబర్దస్త్ షో, పుష్ప మూవీ ఫేమ్ అనసూయ భరద్వాజ్ సోమ వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. షాప్లోని నగలను పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా వినియోగదారులకు నాణ్యమైన ఆభరణాలు అందించేందుకు ఏర్పాటు చేయబడింది మణిముఖుర జువెలర్స్ అన్నారు.
జిల్లా కేంద్రంలో రాష్ట్ర రాజధానిని తలదన్నేలా కార్పొరేట్ స్థాయిలో జ్యువెలర్స్ షాప్ను ఏర్పాటు చేసిన తెడ్ల కిషోర్, ఉమ మహేశ్వరి, వారి కుమారుడు సాయి కిరణ్, చాందినీని ఆమె అభినందించారు. గత 13 సంవత్సరాలుగా సాయి సంతోషి జ్యువెలర్స్ ద్వారా వినియోగదారుల మనసులు గెలుచుకునీ ఇప్పుడు నూతనంగా మణిముఖుర జ్యువెలర్స్ ను ఏర్పాటు చేసిన యాజమాన్యానికి ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో దుకాణ యజమానుదారులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.