calender_icon.png 5 November, 2025 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవరయంజాల్‌లో హైడ్రా కూల్చివేతలు

05-11-2025 01:44:19 AM

హర్షం వ్యక్తం చేసిన స్థానికులు

శామీర్‌పేట్, నవంబర్ 4 (విజయక్రాం తి): తూముకుంట మున్సిపల్ పరిధిలోని దేవరయంజల్‌లో నాలా కబ్జా చేసి నిర్మించి న ప్రహరీని హైడ్రా అధికారులు కూల్చి వేశా రు. ఈ ప్రహరీ నిర్మాణం వల్ల ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దేవరయంజాల్ లోని పలు కాలనీలు నీట మునిగాయి. దీంతో స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. నాలా కబ్జా చేసి దానిపైన గోడ నిర్మాణం చేపట్టడం వల్ల వరద నీరు మొత్తం కాలనీలోకి వచ్చిందని హైడ్రా దృష్టికి తీసుకెళ్లారు. విచారణ జరిపిన హైడ్రా అధికారులు జేసీబీ సహాయంతో అక్రమంగా నిర్మించిన గోడను కూల్చివేశారు.దీంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.