05-11-2025 01:46:00 AM
ఎస్డిపిఓ రవీందర్ రెడ్డి హెచ్చరిక
అశ్వాపురం, నవంబర్ 4 (విజయక్రాంతి): అశ్వాపురం మండల ప్రజలకు, పార్టీ నాయకులకు, పార్టీ సభ్యులకు, కార్యకర్తలకు మణుగూరు ఎస్డిపిఓ వి. రవీందర్ రెడ్డి ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఆయన తెలిపిన ప్రకారం, గత రెండు రోజుల క్రితం మణుగూరులో పార్టీ కార్యాలయం విషయమై రెండు పార్టీల మధ్య జరిగిన గొడవ నేపథ్యంలో, కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు, వీ డియోలు పెడుతూ శాంతి భద్రతలకు విఘా తం కలిగించే చర్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో, ఈరోజు నుండి సో షల్ మీడియాలో పార్టీ సంబంధిత అంశాలపై ఎవరు అయినా ఉద్రేకపరిచే లేదా రెచ్చ గొట్టే విధంగా పోస్టులు లేదా వీడియోలు పెట్టినట్లయితే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయబడతాయని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు శాంతి భద్రతలను కాపాడుతూ, చట్టం పట్ల గౌరవభావంతో వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.