calender_icon.png 23 September, 2025 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నటి రాధికకు మాతృవియోగం

23-09-2025 12:07:37 AM

సీనియర్ హీరోయిన్ రాధిక శరత్‌కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రాధిక తల్లి గీత (86) మరణించారు. ఆమె కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతుండగా, ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. గీత.. దివంగత సీనియర్ నటుడు, రాజకీయ నేత ఎంఆర్ రాధా భార్య కావడంతో తమిళ సినీపరిశ్రమతోపాటు రాజకీయ ప్రముఖులు కూడా ఆమెకు నివాళులు అర్పించారు.

గీత అంత్యక్రియలను సోమవారం సాయంత్రం చెన్నైలో పూర్తయ్యాయి. రాధిక.. తన తల్లితో కలిసి ఉన్న ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ ఆమెతో ఉన్న అనుబంధం గుర్తుచేసుకున్నారు. ఒకప్పటి హీరోయిన్ నిరోషా కూడా గీత కూతురే. దీంతో సినీప్రముఖులు రాధిక, నిరోషాలను కలిసి సానుభూతి తెలిపారు.