calender_icon.png 14 May, 2025 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలరించిన ’ఆదర్శ’ రజతోత్సవం

12-05-2025 03:06:08 AM

జగిత్యాల, మే 11 (విజయక్రాంతి): కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలోని జిఎస్ గార్డెన్ బ్యాంకెట్ హాల్లో ఆదివారం జరిగిన స్థానిక ఆదర్శ విద్యాలయ 1999 - 2000 పదవ తరగతి విద్యార్థుల రజతోత్సవ వేడుకలు అలరించాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అలనాడు తమకు విద్యా బుద్ధులు చెప్పిన ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు.

ఉపాధ్యాయులు, విద్యార్థులు మాట్లాడుతూ ఆపాత మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అప్పటి ఉపాధ్యాయులు తత్వాది రాజేంద్రప్రసాద్, బట్టు హరికృష్ణ, నజీముద్దీన్, రామకృష్ణ, దశరథం, శంకర్, రజతోత్సవ నిర్వాహకులు అఫ్రోజ్, అస్రార్, లక్ష్మణ్, కిషోర్, నరేష్, సత్యం, రూపేష్, సంతోష్, పద్మ, మమత, పావని  తదితరులు పాల్గొన్నారు.