20-08-2025 07:33:45 PM
హుజురాబాద్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు జి సునీత
హుజురాబాద్,(విజయక్రాంతి): రైతులు సాంప్రదాయ ఎరువులు వాడకం వల్ల నీరు, నేల కలుషితమవుతాయని హుజురాబాద్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు జి.సునీత అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణ పరిధిలోని కేసి క్యాంపులో గల రైతు వేదికలో బుధవారంనూతన వ్యవసాయ పద్ధతులు, పర్యావరణ పరిరక్షణ, రైతులకు పెట్టుబడి ఖర్చుల తగ్గింపు లక్ష్యంగా వ్యవసాయ శాఖ, ఐఎఫ్ఎఫ్సిఓ సహకారంతో నానో ఎరువులపై డీలర్లకు, రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సునీత మాట్లాడుతూ... సంప్రదాయం ఎరువులు యూరియా, డిఎపి వాడడం వల్ల నేల, నీరు కలుషితమవుతాయని, పెట్టుబడి ఖర్చులు పెరుగుతాయన్నారు. నానో యురియా, నానో డిఏపి వంటి ద్రవరూపా ఎరువులు వాడటం వల్ల అధిక దిగుబడి సాధించవచ్చని తెలిపారు నానో ఎరువుల వినియోగ సామర్థ్యం 80% వరకు ఉంటుందని వీటిని పంట కాలంలో ఒకసారి పిచు కారి చేసుకుంటే సరిపోతుందని రైతులకు తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల వ్యవసాయ అధికారులకు క్షేత్రప్రదశన ద్వారా రైతులకు నానో ఎరువులపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఐఎఫ్ఎఫ్, సీఈవో కంపెనీ మేనేజర్ బాలాజీ మాట్లాడుతూ... నానో ఎరువులు వాడటం వల్ల భూసారం పెరుగుదల, రైతులకు వ్యాయాభారం తగ్గుతుందన్నారు. నానో యూరియా వాడే రైతులకి ప్రమాద బీమా కల్పిస్తున్నామన్నారు. రైతులకు నానో యూరియాపై వచ్చిన సందేహాలను నిపుణులు నివృత్తి చేశారు.