calender_icon.png 20 September, 2025 | 8:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రోటోకాల్ వివాదంపై జిల్లా అదనపు కలెక్టర్ సీసీ, పోలీస్ కానిస్టేబుల్ సస్పెండ్

20-09-2025 06:23:22 PM

గద్వాల్: ప్రభుత్వ కార్యక్రమాలో పాల్గోనే బహుజనులను సభావేధిక సాక్షిగా ప్రోటోకాల్ పాటించక అవమానాలకు గురిచేయడటం బడుగు బలహీన వర్గాల మీద దాడి చేయడమే అని, అధికార పార్టీ ప్రజాప్రతినిధులను అధికారులు గౌరివించకుండా ప్రొటోకాల్‌ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీళ్లి శ్రీనివాసులు, అలంపూర్‌ మార్కెట్ యార్డు చైర్మన్ దొడప్ప, బహుజన సామాజికవర్గం నాయకులు డిమాండ్ చేశారు. ఈనెల 17న కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి ప్రోటోకాల్ పాటించని అధికారుల తీరును నిరసిస్తూ శనివారం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ,బీసి సామాజిక వర్గం నేతలు ప్రోటోకాల్ పాటించని అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేయాలని జిల్లా ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ (ఐడీఓసీ) ముందు ధర్నా చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఈనెల 17న జిల్లా కలెక్టరేట్ లో ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా నిర్వహించిన వేడుకలకు ఢిల్లీ అధికార ప్రతినిధి ఎపీ జితేందర్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్, గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారని, ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీళ్లి శ్రీనివాసులు, అలంపూర్ మార్కెట్ యార్డు చైర్మన్ దొడ్డప్పలను సభావేధిక పై ఆహ్వానం పలకపోవడంతో ఆగ్రహించిన వారు జిల్లా అధికారులు ప్రోటాకాల్ ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించినందుకు అక్కడ ఉన్న అధికారులు వేధిక మీదకు రానివ్వకుండా అడ్డగించారని తెలియజేశారు.

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కనుసన్నాలలో కలెక్టరేట్ అధికారులు పని చేస్తున్నారని ఆరోపించారు. అధికారుల తప్పిదాలను ఎండగట్టాల్సిన స్థానిక ఎమ్మెల్యే అధికారులకు వత్తాసు పలుకుతూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులను అవమానిస్తున్నారని ఆరోపించారు. ప్రోటోకాల్‌ను పాటించడంలో నిర్లక్ష్యం చూపిన జిల్లా కలెక్టరేట్ అధికారులు, గద్వాల్ పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ప్రోటోకాల్ పాటించని అధికారుల సస్పెన్షన్ కాపీ తనకు అందే వరకు నిరసన కొనసాగిస్తానని వారు చెప్పారు. ఈ విషయంలో కలెక్టర్‌ వెంటనే జోక్యం చేసుకుని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుని సభ్యుల గౌరవాన్ని కాపాడాలని కోరారు.

అడిషినల్ కలెక్టర్ సీసీ సస్పెండ్

ఈనెల 17న‌ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా ప్రోటోకాల్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా ప్రోటోకాల్ నిబంధనలు అమలు పరచడంలో విఫలమైన జిల్లా అదనపు‌ కలెక్టర్ సీసీ రాఘవేంద్ర గౌడ్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలలో విధిగా ప్రోటోకాల్ నిబంధనలు పాటించాలని సూచించారు. అదే విధంగా వేదిక మీదకి వెళ్తున్న జిల్లా గ్రంథాలయ చైర్మన్, అలంపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ ను అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు అక్కడ విధులు నిర్వహిస్తున్న కేటిదొడ్డి పోలీస్ కానిస్టేబుల్ మల్లేష్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస్ రావు ఉత్తర్వులు జారీ చేశారు.