20-09-2025 06:20:52 PM
టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ మల్రాజ్ శ్రీనివాసరావు..
రెబ్బెన (విజయక్రాంతి): కార్మికులకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన వాస్తవ లాభాలలో 35% సింగరేణి ఉద్యోగులకు చెల్లించాలని టీబిజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ మల్రాజ్ శ్రీనివాస రావు డిమాండ్ చేశారు. మంగళవారం రోజున బెల్లంపల్లి ఏరియా ఖైరగూడ ఓపెన్ కాస్ట్ లోని కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరాకు కేవలం 15 రోజుల సమయం ఉన్నదని ఇప్పటి వరకు లాభాలు ఎంతో లాభాల వాటా ఎంతో ప్రకటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని వెంటనే లాభాల వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ సింగరేణి కార్మికులకు అందించిన తండ్రుల ఉద్యోగం కొడుకులకు అయినటువంటి మెడికల్ బోర్డును గత ఆరు నెలల నుండి నిర్వహించడం లేదని వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్, అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి నాయకత్వంలో కోల్ బెల్ట్ ప్రాంత ప్రజా ప్రతినిధుల సహకారంతో హైదరాబాద్ స్థాయిలో కూడా పోరాటం చేయడానికి వెనకాడమన్నారు. ఆయన వెంట ఫిట్ కార్యదర్శి బొంగు వెంకటేష్, ఏరియా కార్యదర్శి మారిన వెంకటేష్, సెంట్రల్ కమిటీ జాయింట్ సెక్రెటరీ ఓరం కిరణ్, నాయకులు జూనియర్ తిరుపతి, దస్తగిరి రమేష్, రాజమౌళి, రాజేశం, బిక్షపతి, అజీమ్, రవీందర్, రవి, కిరణ్, కైతస్వామి,బోరిగం శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.