14-10-2025 05:13:57 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ను యాదాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మార్కెట్ యార్డ్ లో రైతులు వచ్చిన ధాన్యం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షం నుండి కాపాడుకోవడానికి రైతులకు కావలసిన టార్పాలిన్లను అందిస్తామని రైతులు ఆందోళన చెందవద్దని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అన్నారు. రైతులు తమ ధాన్యాన్ని అరబెట్టుకునేందుకు డ్రైయర్ మిషన్ వాడుకోవాలని దీంతో తేమశాతం తగ్గే అవకాశం ఉందని అన్నారు. డ్రైవర్ మిషన్ కు డీజిల్, ట్రాక్టర్ అవసరమవుతావని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దశరథ, ఎం ఆర్ ఐ కరుణాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.