calender_icon.png 25 October, 2025 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

26న జిల్లాస్థాయి సైక్లింగ్ పోటీలు

25-10-2025 12:25:20 AM

కొత్తపల్లి, అక్టోబరు 24 (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26న జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ చైర్మన్, ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి,నరేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 26న ఉదయం 6:30 గంటలకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీ లో అండర్-14, 17, 19, 21, 21 సంవత్సరాలు పైగా బాలబాలికలకు పోటీలను నిర్వహించడం జరుగు తుందని చెప్పారు.

ఈ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారిని నవంబర్ 1, 2 తేదీలలో యాదాద్రి భువనగిరి లోని హామిటాస్ పాఠశాలలో రంగారెడ్డి సైకిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే అంతర్ జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. పోటీలలో పాల్గొనేవారు సైకిల్ తో పాటు వయస్సు ద్రువీకరణ పత్రాన్ని తీసుకొని రావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9032762247 లో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కెప్టెన్ డాక్టర్ బి.మధుసూదన్ రెడ్డి, కార్యదర్శి సురభి వేణుగోపాల్, ప్రతినిధులు ఇ.రమేష్, జగదీశ్వర చారి, తదితరులుపాల్గొన్నారు.