24-10-2025 11:38:09 PM
ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలోని విక్రయించి ప్రభుత్వం మద్దతు ధరను పొందాలి
నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి
మునుగోడు,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం సన్న వరి ధాన్యానికి అందిస్తున్న బోనస్ రూ.500 లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మునుగోడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పీపీసీ సెంటర్ కచలాపురం, ఊకొండి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతులు కొనుగోలు కేంద్రాలలో దాన్యం అమ్ముకొవాలని దళారులకు అమ్ముకొని మోసపోవద్దనీ అన్నారు.
అకాల వర్షానికి ధాన్యము తడవ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే దాన్యం తేమ శాతం 17 శాతం ఉండే విధంగా తాలు,మట్టి,పెళ్లా లేకుండా శుభ్రంగా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వమిచ్చే మద్దతు ధర గ్రేడ్ ఏ 2389 రూపాయలు సాధారణ 2369 రూపాయలు,సన్న వరి ధాన్యానికి 500 రూపాలు బోనస్ అందిస్తుందని ఇట్టి అవకాశాన్ని రైతులు వినియెగించుకోవాలని తెలిపారు. రైతులు నిబంధనలను పాటించి ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు.