24-10-2025 11:56:57 PM
- జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల,(విజయక్రాంతి): కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు బలపరుస్తున్న ప్యానల్ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం జగిత్యాలన్న స్వగృహంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు, అర్బన్ బ్యాంకు ప్యానల్ అభ్యర్థులతో కలిసి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వెలిచాల రాజేందర్ రావు ఒక విజన్ ఉన్న నాయకుడు అని మంచి అభ్యర్థులను ఎంపిక చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
వీరందరిని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. కరీంనగర్ అర్బన్ బ్యాంకు ప్యానల్ ఇద్దరు యువకులను జగిత్యాల నుంచి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రతిపాదించడం పట్ల కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. కరీంనగర్ ప్యానల్ గెలుపునకు ప్రత్యేకంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పడం హర్షనీయమన్నారు. వంబర్ 1న జరిగే అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో ఖాతాదారులు సభ్యులు తమ ప్యానెల్ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని రాజేందర్రావు కోరారు. ఈ సమావేశంలో వెలిచాల రాజేందర్రావు బలపరుస్తున్న ప్యానల్ అభ్యర్థులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.