calender_icon.png 25 October, 2025 | 8:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్లుగా అదనపు కలెక్టర్లు

25-10-2025 12:10:41 AM

  1. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
  2. నియామక ఉత్తర్వులు జారీ  

హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ర్టంలోని అదనపు కలెక్టర్లని ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్లుగా నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా సర్వే, అటవీ సరిహ ద్దుల సెటిల్మెంట్లు (ప్లాన్ కింద) పథకాన్ని రద్దు చేసింది. ఈ పథకం కింద పనిచేసే జాయింట్ కలెక్టర్ పదవిని రద్దు చేసింది. అలాగే ఇతర సిబ్బం దిని వారి విధుల నుంచి విడుదల చేసింది.

సర్వే పూర్తయ్యే వరకు డీఆర్‌ఓ, డీఎఫ్‌ఓలు అందుబాటులో ఉన్న సిబ్బంది సేవలను ఉపయో గించుకోవాలని ఆదేశించారు. అటవీ సెటిల్మెంట్ అధికారుల పనిని సంబంధిత జిల్లాల రెవెన్యూ అడిషన్ కలెక్టర్లకు అప్పగించారు. ఇక నుంచి రెవెన్యూ అడిషనల్ కలెక్టర్లు ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారులుగా వ్యవహరించనున్నారు.

అటవీ భూమిని రిజర్వ్డ్ ఫారెస్ట్‌గా ప్రకటించడానికి ముం దు ఏవైనా అభ్యంతరాలుంటే వాటిని అడిషనల్ కలెక్టర్లు పరిష్కరించనున్నారు. అంతే కాకు ండా అటవీ ఉత్పత్తులకు సంబంధించిన హక్కులను, తదితర సమస్యలను పరిష్కరించనున్నారు.