calender_icon.png 25 October, 2025 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖాళీ పోస్టుల్లో గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకోవాలి

25-10-2025 12:10:26 AM

-ఇంటర్ బోర్డుకు అధ్యాపకుల వినతి

హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 309 పోస్టుల్లో స్థానికం గా జిల్లా సీనియార్టీ ప్రకారం గెస్ట్ ఫ్యాకల్టీలను సర్దుబాటు చేయాలని ఇంటర్ బోర్డు సెక్రటరీని అధ్యాపకులు కోరారు. జూన్‌లో కొత్తగా ఏర్పడిన 18 జూనియర్ కాలేజీల్లోని పోస్టులను తమతో భర్తీ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. తొలుత జిల్లాల సీనియార్టీ ప్రకారం భర్తీ చేసి, మిగిలిన పోస్టుల్లో స్థానికేతరులకు సర్దుబాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాలేజీల్లోని ఈ ఖాళీలను భర్తీ చేయక 4 నెలలు గడుస్తుందని, దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. అలాగే గత సంవత్సరం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో పెండింగ్ వేతనాలివ్వాలని కోరారు.