calender_icon.png 12 October, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైనాపై అదనంగా 100% సుంకాలు

12-10-2025 02:09:36 AM

మరో బాంబ్ పేల్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

వాషింగ్టన్, అక్టోబర్ 11: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చైనాపై సుంకాల బాంబు పేల్చారు. తాజాగా చైనా దిగుమతులపై అదనంగా 100 శాతం సుం కాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. కొత్త టారిఫ్‌లు వచ్చే నెల 1వ తేదీ లేదా అంతకు ముం దు నుంచే అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. ట్రంప్ ఇప్పటికే చైనాపై 30శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.

ట్రం ప్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ‘చైనాలో తయారైన వస్తువులు ఏ దేశం నుంచి దిగుమతి అయినా.. చైనా ఏ ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి చేసినా వాటికి ఈ సుంకాలు వర్తిస్తాయి’ అని ప్రకటించారు. చైనా తదుపరి స్పందన బట్టి తాము తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశా రు. అలాగే, క్రిటికల్ సాఫ్ట్‌వేర్‌ను ఇతర దేశాలతో పంచుకోవడంపై నియంత్రణ విధిస్తు న్నట్లు ట్రంప్ వివరించారు.

అమెరికాలో త యారయ్యే సుమారు ప్రతి ఉత్పత్తి పైనా భా రీగా ఎగుమతి ఆంక్షలు విధించాలని చైనా యోచిస్తోందని, వాటి ఆధారంగానే అమెరికా తాజాగా సుంకాల నిర్ణయం నిర్ణ యం తీసుకుందని తేల్చిచెప్పారు. అమెరికాకు అరుదైన ఖనిజాలు ఎగుమతులపై చైనా ఆం క్షలు విధించగా, గతంలో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసి, భారీ సుంకాలు విధిస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం, దీని లో భాగంగానే 30శాతం సుంకాలు విధించడం సంభ వించింది. తాజాగా అదనంగా మరో 100 శాతం సుంకాలు విధించడం గమనార్హం.