calender_icon.png 12 October, 2025 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఎస్‌ఐ ఏజెంట్ అరెస్ట్

12-10-2025 02:08:24 AM

  1. హనీట్రాప్‌కు చిక్కి ఏజెంట్‌గా..

భారత రక్షణశాఖ రహస్యాలు పాక్‌కు చేరవేత

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: హనీట్రాప్‌లో చిక్కుకుని ఐఎస్‌ఐ ఏజెంట్‌గా మారి రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి పాకిస్థాన్‌కు భారత రక్ష ణశాఖ రహస్యాలు చేరవేశాడు. ఇంటెలిజెన్స్ అధికారులు చాకచక్యంగా వ్యవహరించి అతడిని అదుపులోకి తీసుకున్నాడు. అల్వార్ ప్రాంతానికి మంగత్ సింగ్ గత రెండేళ్లుగా పాకిస్థాన్ హ్యాండ్లర్లతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు రాజస్థాన్ ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి.

జాతీయ రాజధాని ప్రాంతం లో అత్యంత కీలకమైన అల్వార్ ఆర్మీ కంటోన్మెంట్‌తో పాటు, ఇతర వ్యూహాత్మక ప్రాంతా ల వివరాలను అతను శత్రుదేశానికి పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. సోష ల్ మీడియాలో ’ఇషా శర్మ’ అనే నకిలీ పేరు తో ఒక పాకిస్థానీ మహిళా ఏజెంట్ మంగత్ సింగ్‌కు వలవేసినట్లు దర్యాప్తులో తేలింది. మాటలతో నమ్మించి, డబ్బు ఆశ చూపి, అతని నుంచి సైనిక రహస్యాలను రాబట్టినట్లు అధికారులు వెల్ల డించారు.

ఈ సమా చారం అందించినందుకు గాను, అతనికి పెద్ద మొత్తంలో డబ్బు ముట్టినట్లు ఆధారా లు లభించాయి.రాష్ట్రంలోని వ్యూహాత్మక ప్రదేశాల వద్ద అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ అధికారులు, మంగత్ సింగ్ కదలికలను పసిగట్టారు.

అత ని ఫోన్‌ను టెక్నికల్‌గా విశ్లేషించిన తర్వాత, శుక్రవారం మంగత్‌సింగ్‌ను అరెస్ట్ చేశారు. ‘అరెస్ట్ అయ్యేంత వరకు కూడా అతను పాక్ హ్యాండ్లర్లకు సమాచారం పంపుతూనే ఉన్నా డు. రెండు పాకిస్థానీ నంబర్లతో నిరంతరం టచ్‌లో ఉన్నాడు’ అని ఇంటెలిజెన్స్ డీఐజీ రాజేశ్ మీల్ తెలిపారు.