calender_icon.png 12 October, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అట్డుడికిన లాహోర్ నగరం

12-10-2025 02:10:53 AM

  1. పాలస్తీనాకు మద్దతుగా పాక్ పౌరుల ర్యాలీ
  2. పోలీసుల కాల్పుల్లో 11 మంది టీఎల్పీ కార్యకర్తలు మృతి

ఇస్లామాబాద్, అక్టోబర్ 11: గాజాలో మ రణాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రం ప్ శాంతి ప్రణాళికకు వ్యతిరేకంగా పాకిస్థాన్‌లో తీవ్ర నిరసనలు కొనసాగుతున్నాయి. ఇస్లామిక్ సంస్థ తెహ్రీక్- ఇ -లబైక్ పాకిస్థాన్ (టీఎల్‌పీ) కార్యకర్తలు గురువారం నుంచి పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అయితే టీఎల్‌పీ కార్యకర్తలు స్థానికులతో కలిసి చేస్తున్న ఆందోళనలు హింసాత్మక ఘర్షణలకు దారితీశాయి.

తాజాగా శనివారం లాహోర్‌లో చేపట్టిన పాలస్తీనా అనుకూల ర్యాలీని భద్ర తా దళాలు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిరసనకారులపై  పోలీసులు కాల్పు లు జరిపారు. ఇప్పటివరకు 11 మంది టీఎ ల్పీ కార్యకర్తలు మరణించినట్లు, 24 మంది క్షతగాత్రులు అయినట్లు ఆ సంస్థ చీఫ్ సాద్ రిజ్వి స్పష్టం చేశారు.

క్షతగాత్రులను ఆస్పత్రులకు తీసుకువెళ్తే వైద్యం చేయడానికి కూడా అక్కడి వైద్యులు నిరాకరించినట్లు తెలిపారు. తమ పార్టీ కార్యకర్లపై పోలీసులు ఉద్దేశపూర్వకంగానే దాడులు చేస్తున్నారని ఆరోపించా రు. శాంతియుతంగా చేపట్టిన నిరసనలను అణచివేయాలని చూస్తున్నారన్నారు.