19-08-2025 01:24:51 AM
చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండలంలోని కసాన్ పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల అంకితభావానికి, విద్యార్థుల ప్రతిభకు,ముగ్దులై విద్యార్థులకు ఏదైనా సహాయం చేయాలని ముందుకొచ్చారు గజ్వెల్ కేంద్రంగా పనిచేసే స్వామి వివేకానంద సేవా సమితిసభ్యులు. కసాన్ పల్లి ప్రభుత్వ పాఠశాల, ప్రైవేట్ పాఠశాలల కంటే బ్రహ్మాండంగా పనిచేస్తుందని, కొంతమంది ఉపాధ్యాయ మిత్రుల ద్వారా తెలుసుకున్న సొసైటీ సభ్యులు, ప్రధానోపాధ్యాయురాలు, సంగీత.
సూచన మేరకు సొసైటీ సభ్యులు, పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడే సుమారు రూ.20 వేలరూపాయల విలువ గల స్పోర్ట్స్ దుస్తులను, ప్రధానోపాధ్యాయురాలు సంగీత ఆధ్వర్యంలో, పాఠశాల విద్యార్థులకు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు సంగీత, మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు, స్పోర్ట్స్ దుస్తులు,ఉచితంగా అందించిన స్వామి వివేకానంద సేవా సమితి సభ్యుల దాతృత్వాన్ని అభినందించారు.