calender_icon.png 19 August, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇదొక చెత్త సర్కారు

19-08-2025 01:25:13 AM

  1. మున్సిపల్, ఆరోగ్య శాఖల సమన్వయ లోపం
  2. హైదరాబాద్ సహా ఇతర పట్టణాల్లో కంపు
  3. పాలకులు మాత్రం ‘ఆర్‌ఆర్ ట్యాక్స్’ వసూళ్లలో బిజీ
  4. ప్రభుత్వ అసమర్థతతో తరలిపోతున్న పరిశ్రమలు
  5. గుజరాత్‌కు తరలిన 2,800 కోట్ల ‘కేన్స్’ పెట్టుబడి 
  6. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం

హైదరాబాద్, ఆగస్టు 18 (విజయక్రాం తి): రాష్ట్రంలో ప్రస్తుతం ‘చెత్త’ సర్కారు పాల న కొనసాగుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శిం చారు. మున్సిపల్, ఆరోగ్య శాఖల సమన్వ య లోపంతో ఎక్కడ చూసినా మురుగు నీరు, చెత్తకుప్పలతో హైదరాబాద్ నగరం, ఇతర పట్టణాలు కంపుకొడుతున్నాయని సోమవారం ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు.

ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. బీఆర్‌ఎస్ హయాంలో వర్షాకాలా నికి 2 నెలల ముందే సీజనల్ వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలపై మున్సిపల్, జీహెఎంసీ, వైద్యారోగ్యశాఖలు సమీక్షా, సమన్వ య సమావేశాలు నిర్వహించి, ముందస్తు చర్యలు చేపట్టేవని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదని ఆగ్రహించారు. ప్రజలు రోగాలతో అలమటిస్తుంటే.. పాలకులు మాత్రం ‘ఆర్‌ఆర్ ట్యాక్స్’ వసూళ్లలో బిజీగా ఉన్నారని ఆరోపించారు.

ఢిల్లీకి ఏటీఎంలా రాష్ట్రాన్ని వాడుకోవడమే కాంగ్రెస్ అజెండా

కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనం, నిర్లక్ష్యపు పాలనా విధానాలతోనే తెలంగాణకు రావాల్సిన భారీ పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని కేటీఆర్ విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో ఎంతో శ్రమించి రాష్ట్రానికి తీసుకొచ్చిన రూ.2,800 కోట్ల పెట్టుబడి, 2 వేల ఉద్యోగాల సామర్థ్యం గల ‘కేన్స్ టెక్నాలజీ’ సెమీకండక్టర్ల పరిశ్రమ కాంగ్రెస్ సర్కార్ అసమర్థత వల్ల గుజరాత్‌కు తరలిపోవడం అత్యంత బాధాకరమ పేర్కొన్నారు.

వరుసగా పరిశ్రమలు తరలిపో తున్నా ఇప్పటివరకు సీఎం రేవంత్‌రెడ్డి కనీ సం స్పందించడం లేదన్నారు. గతంలో తమ ప్రభుత్వం ఎంతో శ్రమించి కర్ణాటకకు వెళ్లాల్సిన కేన్స్ పరిశ్రమను తెలంగాణకు రప్పిం చిందన్న కేటీఆర్, వారు కోరిన వెంటనే పది రోజుల్లోనే కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ పక్కనే భూములు కేటాయించామని గుర్తుచేశారు.

పెట్టుబడులు తేవడంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రత్యేక కృషి ఏమీ లేదని, తెలంగాణ ఆటో పైలెట్ మోడ్‌లో ఉందని చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి,  ప్రస్తుతం వేరే రాష్ట్రాలకు తరలిపోతున్న పరిశ్రమలపై ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. 

రేవంత్ సీఎం అయ్యాక తెలంగాణ ప్రగతి ‘ఆటో-డిస్ట్రక్షన్’ (స్వయం విధ్వంసక) మోడ్‌లోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. కమీష న్లపై తప్ప పరిశ్రమలను నిలుపుకోవడం, కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో ఈ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేదని మం డిపడ్డారు. రాష్ట్రాభివృద్ధి, ఉద్యోగాల కల్పనలను గాలికొదిలేసిన ప్రభుత్వం.. ఢిల్లీ కాం గ్రెస్ పెద్దలకు తెలంగాణను ఏటీఎంగా మార్చి, ఇక్కడి సంపదను వారికి తరలించడం అనే పని మాత్రమే ఇవాళ ఆటో-పైలట్ మోడ్‌లో నడుస్తోందని తెలిపారు.