19-08-2025 01:20:10 AM
పశువుల కాపరులు, మత్సకారులు జాగ్రత్తలు పాటించాలి
గంభీరావుపేట,(విజయక్రాంతి): భారీ వర్షాల కారణంగా నర్మల ఎగువ మానేరు నిండి మత్తడి దుంకే అవకాశం ఉందని, పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎం.ఆర్.ఓ మారుతి రెడ్డి హెచ్చరించారు. సోమవారం ఎగువ మానేరును సందర్శించిన ఎమ్మార్వో, పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువుల కాపరులు గొర్రెలు, మేకలను మానేరు పరిసర ప్రాంతాలలో మేతకు తీసుకువెళ్లరాదని, మత్సకారులు చేపల వేటకు వెళ్ళదని సూచించారు. పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, వర్షాల నేపథ్యంలో ఎవరు కూడా పాత ఇండ్లలో నివసించవద్దన్నారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, పశువుల కాపరులు అటవీ ప్రాంతాల్లో ఎవరు సంచరించరాదన్నారు.
తాత్కాలికంగా రహదారి మూసివేత:
మానేరు నిండి మత్తడి దుంకితే వరద ప్రభావానికి గంభీరావుపేట, లింగన్నపేట గ్రామాల మధ్య ఉన్న మట్టి రోడ్డు కొట్టుకపోయే ప్రమాదం ఉన్నందున రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు.