19-08-2025 02:03:46 AM
రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటిస్తున్న చిత్రం ‘శశివదనే’. ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్‌వీఎస్ స్టూడియోస్ బ్యానర్లపై అహితేజ బెల్లంకొండ, అభిలాష్‌రెడ్డి గోదాల నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయిమోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి స్పందన దక్కింది. ఈ సినిమాను దసరా సీజన్‌లో అక్టోబర్ 10న విడుదల చేయనున్నామని మేకర్స్ సోమవారం ప్రకటించారు. ఈ చిత్రా నికి సంగీతం: శరవణ వాసుదేవన్; నేపథ్య సంగీ తం: అనుదీప్ దేవ్; కెమెరా: శ్రీసాయికుమార్ దారా, ఎడిటర్: గ్యారీ బీహె.